గోవిందరావు మృతికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల సంతాపం

భౌతికకాయానికి నివాళుల‌ర్పించిన‌ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

విశాఖ‌: స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రాజకీయ ఒత్తిడితో జీవీఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరావు మృతి చెందడం అత్యంత బాధాకరమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆందోళ‌న‌ వ్యక్తం చేశారు. గోవిందరావు భౌతిక కాయానికి వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కే.కే. రాజు , మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ , గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి  , తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు , మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా  పార్టీ నేతలు మాట్లాడుతూ, రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం వల్ల ఒక నిబద్ధత గల అధికారి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గోవిందరావు కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోవిందరావు సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున సంతాపం, ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. 

Back to Top