జనసేన చంద్రబాబుకు ఓ భజన సేన

మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  

తాడేప‌ల్లి: జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలాగా మారిందని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  అన్నారు. సోమ‌వారం వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడారు.

  • పవన్ కల్యాణ్ ను అటు భీమవరం..ఇటు గాజువాకలోను ప్రజలను తన్ని తరిమి నేలపై దేకించారు.
  • 15 ఏళ్ళుగా జనసేను ప్రజలు గుర్తించలేదు.పైగా తిరస్కరించారు.
  • ప్రజలు పదే పదే నువ్వు చంద్రబాబుకు భజన చేస్తున్నావని చెబుతున్నా కూడా అర్దం కానట్లు పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.
  • ప్యాకేజిల కోసం ఎన్నికల సందర్బంగా వైయస్సార్ సిపి నేతలపై వీరోచితంగా మాట్లాడితే సరిపోతుందన్నట్లుగా పవన్ కల్యాణ్ వైఖరి ఉంది.అలా అయితేనే ప్యాకేజి దక్కుతుందన్నట్లుగా ఉంది.
  • నిన్ను నమ్ముకున్న అభిమానులకు,సామాజికవర్గానికి  మేలు చేసే విధంగా పవన్ కల్యాణ్ ఏ రోజు కూడా ఆలోచించడం లేదు.
  • పవన్ కల్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు. ఆయనను నమ్ముకున్నఅమ్మాయిలకు న్యాయం లేదు.పార్టీకార్యకర్తలకు,నేతలకు పావలా న్యాయం చేయని వ్యక్తి పవన్.
  • జగన్ గారు సూటిగా చెప్పారు... ఒకర్ని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు అని....నీవు(పవన్) వేసే చిల్లరవేషాలకు నిన్ను అన్నారే కాని నీ భార్యలను తిట్టినట్లు కాదు.
  • వివాహవ్యవస్ధను,వివాహ బంధాన్ని హేళన చేస్తూ నాలుగేళ్ళకు ఒకసారి...ఐదేళ్ళకు ఒకసారి హేళన చేయడమే పనిగా పెట్టుకున్న నీకు పెళ్ళాలు,బార్యల అర్దం తెలుసా అని ప్రశ్నించారు.
  • నీ ప్యాకేజి రాజకీయాలకోసం ఈరోజు నీ అన్న చిరంజీవిని కూడా రోడ్డుపైకి లాగుతున్నావు.
  • చిరంజీవిగారిని ఎవ్వరూ ఏమీ విమర్శించలేదు. పవన్ కల్యాణ్ ను అంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.ఆయన సినిమా అయిపోయింది.అందుకనే చిరంజీవిగారిని తీసుకువస్తే ప్యాకేజి వర్కవుట్ అవుతుందని పవన్ కల్యాణ్ బావిస్తున్నారు.
  • ఇది దుర్మార్గమైన రాజకీయం.ప్రజలకు న్యాయం చేస్తానని,తన అభిమానులకు న్యాయం చేసేందుకు ఒక్క పనీ చేయని వ్యక్తి పవన్ కల్యాణ్.
  • చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్.బిజేపితో పొత్తు కుదిర్చి చంద్రబాబుకు మేలు కలిగేలా చేశాడు.జాతీయపార్టి వద్ద చంద్రబాబుకోసం నాటకాలు ఆడాడు.
  •  నీ అన్యాయానికి గురైనవారు ఆక్రోశం వెలిబుచ్చుతుంటే కనీసం రెస్పాండ్ కాని వ్యక్తి.
  • నీ పార్టీ కోసం పనిచేసినవారిని నిర్లక్ష్యం చేస్తూ చంద్రబాబు చెప్పిన వారికి జనసేన టిక్కెట్లు కేటాయిస్తున్నందుకు సిగ్గుపడాలి.
  • బాద్యత లేకుండా చితక్కొడదాం...చించేస్తాం..ఈడుస్తాం అనే మాటలు మీకు భవిష్యత్తు కనబడటం వల్లనే వస్తున్నాయి.భయం..వణుకు పుట్టి ఇలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు.
  • నీ ఉడుత ఊపులకు ఇక్కడ ఎవరూ భయపడరు.ఇక్కడ ఉన్నది కోట్లాది మంది ప్రజల అభిమానం పొందిన వైయస్ జగన్..వైయస్సార్ సిపి ప్రభుత్వం అనేది గుర్తించుకోవాలి.
  • నీలాగా పిరికిపందల పార్టీ..ప్యాకేజిల కోసం అర్రులు చాచే వ్యక్తులు కాదు.మరొకసారి చెత్త మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం.సొల్లు కబుర్లు మాని ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి.
  •  2014 లో ఉన్న నీ ప్రభుత్వం ఇది చేసిందని చెప్పే దమ్ము ఉందా....పచ్చి రౌడీలు లాగా మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు.
  • ప్రజలు నీ తాట తీయడానికి సిధ్దంగా ఉన్నారని గుర్తుంచుకుని ప్రవర్తించాలని పవన్ కల్యాణ్ కు హితవు చెప్పారు.
Back to Top