తాడేపల్లి: చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్‌లు తీసుకుంటున్నారు. మీ యూటర్న్‌ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి?. అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి అని నిలదీశారు. వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో, కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కకున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైయస్ అవినాష్‌రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు. శుక్రవారం వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే ఆమె మాటల్లోనే.... కోర్టుపరిధిలో ఉన్నకేసుపై హంతకుడు అని షర్మిలే తీర్పు చెప్పేస్తున్నారు.శిక్ష కూడా ఆమె వేసేస్తున్నారు.ఇది నీచమైన రాజకీయం.విచారణ పరిధిలో ఉన్న అంశాలను ఎన్నికల అంశంగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయడం అవసరమా అని అడుగుతున్నాను.అది కూడా కడప గడ్డపై నిలబడి మాట్లాడుతున్నారు.వైయస్ కుటుంబంలో చిచ్చుపెట్టడానికి జరుగుతున్న రాజకీయాన్ని మూడు దశాభ్దాలుగా చూశారు.రాజశేఖరరెడ్డి బతికున్నసమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు...ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్న కుట్రలు కడప ప్రజలకు ఏమీ కొత్తకాదు.వైయస్సార్ చనిపోయాక ఈరోజు మీరు ఏదైతే సానుభూతికోసం మాట్లాడుతున్నారో అదే వివేకానందరెడ్డిగారు వైయస్ కుటుంబంనుంచి పూర్తిగా డీవియేట్ అయి ఓ మంత్రి పదవికోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్ గారికి,వైయస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆరోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా...వైయస్ వివేకానందరెడ్డి గారిని ఎంఎల్సి ఎన్నికలలో ఓడించడానికి ప్రయత్నించి ఇప్పుడు మీ పక్కన మాట్లాడుతున్న బిటెక్ రవితోపాటు పలువురు ఈరోజు మీ గురించి సానుభూతిగా మాట్లాడుతున్నారు. నిటారుగా నిలబడుతున్న నాయకత్వాన్ని వెన్నువిరగగొట్టాలని అటు వైయస్సార్ పై ప్రయత్నం చేశారు.ఇటు ఆయన తనయుడు వైయస్ జగన్ గారిపై ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబుతో షర్మిల చిక్కుకోవడమే మా దురదృష్టం...చంద్రబాబు అదృష్టం అన్నారు.ఈరోజు కడప గడ్డపై నిలబడి హత్యారాజకీయాల గురించి షర్మిల మాట్లాడుతున్నారు.అసలు ఎవరైనా ఎన్నికలలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ద్యేయంతో పోటీ చేద్దామని అనుకుంటారు.ప్రజల సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకం ఉన్నవాళ్ళు పోటీ చేస్తారు.పార్టీలు పెట్టాలని బావిస్తుంటారు.పార్టీలకు నాయకత్వం వహించాలని అనుకుంటారు. హంతకుడు అని అవినాష్ రెడ్డిగారిపై ముద్రవేస్తున్నారు.కేసు విచారణలో ఉండగా అలా మాట్లాడటం తప్పు కదా. కోర్టులపై, చట్టాలపై మీకు నమ్మకం లేదు. మీ బుర్రలో ఏది తోస్తే అదే.అదే తీర్పు అదే విచారణ.శిక్ష కూడా మీరే వేయాలనే ఆలోచన సరైనదేనా.కోర్టు విచారణలో జరుగుతున్న విషయాలు అలాంటి అంశాలపై మాట్లాడాలంటే ఈ ప్రెస్ మీట్ సరిపోదు.విచారణ పరిధిలో ఉన్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడంలో మీ రాజకీయం ఏంటి. ఆరోజున జగన్ గారికి,వైయస్ విజయమ్మగారికి వ్యతిరేకంగా నిలబడిన వైయస్ వివేకాగారిని నిలపడంలో సునీత ఆ కుటుంబం ఆరోజున ప్రోత్సహించింది నిజం కాదా..ఈరోజు మీ స్వార్ధ కారణాలతోటి మీరంతా ఏకమై ఈరోజు స్ర్కిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు.చంద్రబాబో..మరొకరో ఇలా మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు కనుక మిమ్మల్ని పావులుగా మార్చుకుని మాట్లాడిస్తున్నారు. మీరు పావులుగా మారడం దురదృష్టకరం.ఎన్నికలలో పోటీ అనేది ఆఖరికోరికల కోసం కాదు.కోర్టుపరిధిలో ఉన్న అంశాలకోసం అంతకంటే కాదు.అలా ఎవరైనా ఇప్పటివరకు మాట్లాడారా...అది సమంజసమేనా. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంలో కాంగ్రెస్సే దోషి. ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ దోషి కాదా. ప్రత్యేక హోదా ఏపికి దక్కకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెసే.రాష్ర్టాన్ని చాలా అన్యాయంగా విభజించారు.విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశంగా పెట్టలేదు.రాజకీయంగా తనకు ప్రయోజనాలు దక్కితే చాలు.రాష్ర్టం గాలికిపోయినా పర్వాలేదు అనేలా కాంగ్రెస్ వ్యవహరించింది.ఏపిపై కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టి రాష్ర్టాన్ని కుయుక్తులు,కుట్రలతో విభజించింది.విభజన చట్టంలో హోదాను పెట్టకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడటం మీరు దానిని నెత్తినెక్కించుకోవడం సరైనదేనా.జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్,మ నేడు రాజకీయాలకోసం...మాట్లాడుతున్నారు.నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని మీరు మాట్లాడారు కదా.ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు.దాని గురించి మీరు మాట్లాడరా.పబ్లిక్ లోకి వస్తే మీరు తీసుకున్న యూటర్న్ ల గురించి ఎందుకు మాట్లాడరు. ప్రజలకు షర్మిల సంజాయిషీ చెప్పాలి. కోర్టుల పరిధిలో ఉన్న అంశాలను భూతద్దంలో చూపుతూ షర్మిల మాట్లాడుతున్నారు.మీరు మాట్లాడేది కడప ప్రజలు అర్దం చేసుకుంటారు.కాని బయటప్రజలకు వాస్తవాలు చెప్పాలి కనుక మేం మాట్లాడాల్సి వస్తోంది అన్నారు. కడప ప్రజలు గురించి మాకు ఎటువంటి భయం,ఆందోళనా లేదు.ఇలాంటి కుట్రలను వారు ఎన్నింటినో చూశారు.స్వయంగా షర్మిలగారు ఈ కుట్రలో పావులు కావడం పట్ల ప్రజలు జాలిపడుతున్నారు.ప్రజల ఎదుట పదే పదే మాట్లాడుతున్నారు కనుక ప్రజలకు మీరు సంజాయిషీ చెప్పాల్సిన అంశాలున్నాయి.ఎదురుదాడి చేయడం కాదు. తెలంగాణాలో పార్టీ పెట్టి నాయకులను,కార్యకర్తలను నిండా ముంచారు. అసలు తెలంగాణాలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు.ఎందుకు ఎత్తేశారు.పార్టీ పెట్టినప్పుడు తెలంగాణానే నా గడ్డ అన్నారు.నీటి కేటాయింపుల విషయంలో అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా పోరాడతానన్నారు.తెలంగాణా ప్రజలకోసం ఆ రాష్ర్టం కోసం ఏపి ప్రజలను కూడా పట్టించుకోనన్నారు.ఏపికి నష్టం జరిగినా కూడా తెలంగాణాకోసం కట్టుబడతానన్నారు.అక్కడ పార్టీ పెట్టి నాయకులను,కార్యకర్తలను ముంచారు.ఉన్నపళంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.కాంగ్రెస్ పార్టీ చుట్టపుచూపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాని,మీ సహకారం కావాలని కాని కోరలేదు.ఎన్నికలలో గెలిచిన తర్వాత నా వల్ల కాంగ్రెస్ గెలిచిందని మీరు చెప్పుకోవడం మినహా మీకు కాంగ్రెస్ కనీసం ధాంక్స్ కూడా చెప్పలేదు.ఇంత అవమానకరంగా వ్యవహరించినా కూడా మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.ఇప్పుడు ఏపిలో ల్యాండ్ అయ్యారు.ఇక్కడ పిసిసి అధ్యక్షుడై ఈరోజు ఆంధ్రగడ్డ..కడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు.ఆరోజు ఎందుకు ఏపి ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఎందుకు అనుకున్నారు.లేదు..లేదు అదంతా తూచ్ అని నేడు ఎందుకు అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మెయిన్ విలన్ కాంగ్రెస్ అని గతంలో షర్మిలే అన్నారు. రాజకీయాలలో చంద్రబాబును ఊసరవెల్లిగా ఇప్పటివరకు చూశాం.ఎందుకంటే ఆయన ఎన్నో యూటర్న్ లు తీసుకుంటారు.నరేంద్రమోదిని తిడతారు.తిరిగి ఇప్పుడు జతకడతారు.ఇవన్నీ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయం కాని ఈరోజు మీరు చేస్తున్నదేంటి. ఇన్ని యూటర్న్ లు మీరు ఎందుకు తీసుకుంటున్నారు.ముందు మీరు వివరణ ఇవ్వాలి.హత్యా రాజకీయాలు.వ్యక్తిగతమైన బాధలు చెప్పుకుంటున్నారు.కాని మీరు చేసిన రాజకీయానికి కనీసం ప్రజలకు సంజాయిషీ చెప్పాలని మీకు ఎప్పుడూ అనిపించడం లేదా.నాలుగు మాటలు ఎదురుదాడి చేయడం,జగన్ గారిపై కోపం...రాజకీయంగా ఏమీ దక్కలేదనే బాధ పదే పదే వ్యక్తం చేస్తున్నారు.మీరు యూటర్న్ లు తీసుకోవడం వెనక కారణం ఏంటి.కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికి అన్యాయం చేసిందన్న మీరు నేడు అదే కాంగ్రెస్ ఎలా న్యాయం చేస్తుందని చెబుతున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మెయిన్ విలన్ కాంగ్రెస్ అని చెప్పి ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కాంగ్రెస్ రావాలని అంటున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా అవినాష్ ను హంతకుడు అని ఎలా అంటారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు. ఆ కేసు విచారణలో ఉంది. నిజానిజాలు తేలలేదు.మీరు కొన్ని అభిప్రాయాలను పెట్టుకుని వివేకానందరెడ్డి హంతకులు ఉన్నారో.ఆయనను ఎన్నికలలో ఓడించాలని పనిచేశారో..ఆయనను రాజకీయాలలో లేకుండా చేయాలని చూశారో వారందరితో చేతులు కలిపి పనిచేస్తున్నారు.మరొపక్కన అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు.ఎన్నికల సమయంలో ఒక పార్టీ అభ్యర్దిని ఆధారాలు లేకుండా హంతకుడు అని ముద్రవేస్తూ ప్రచారం చేయడం అంటే ఇది నీచమైన రాజకీయం.పతనమైన రాజకీయం అనేది అర్దమవుతుంది.రెండురోజులు పోతే జగన్ గారిని కూడా అంటారు.మాకేమీ అనుమానం లేదు.మీకు ఏ స్దాయిలో ఉన్నారనేది మాకు కూడా అర్దం అవుతుంది. జగన్ గారిని ఓడించాలని మీరు పిలుపు ఇస్తున్నారు.సునీతగారు కూడా జగన్ గారిని ఓడించాలని అంటున్నారు. చంద్రబాబు,బిజేపి,జనసేన,కాంగ్రెేస్ పార్టీ అజెండా ఒక్కటే జగన్ గారిని అర్జెంట్ గా అధికారం నుంచి దించేయాలి. ఏ కారణం చెప్పకుండా జగన్ గారిని ఓడించాలని అంటున్నారంటే మీ జెండా..అజెండా ఏంటో ప్రజలు గ్రహించారనేది మీరు తెలుసుకోవాలి.జగన్ గారిని ఓడించాలనే ధ్యేయంతో పనిచేస్తున్న మీరు రేపు ఆయనను కూడా హంతకుడు అంటారు...రెండురోజులు ఆగితే అదే మీ నోటి నుంచి వచ్చే మాట.ఈరోజు ప్రజలముందు చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి. షర్మిల రాజకీయం రాజశేఖరరెడ్డికి తలవంపులు తెచ్చేలా ఉంది. వైయస్సార్ బిడ్డా చేస్తున్న ఈ రాజకీయం చూస్తున్న అబిమానులు చాలా బాధపడుతున్నారు. వైయస్సార్ పేరు నిలబడిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన చనిపోయి 15 ఏళ్ళు తర్వాత వైయస్సార్ ను గుర్తుపెట్టుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన తనయుడు వైయస్ జగన్ గారు. పార్టీని పెట్టడమే కాదు కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొని వైయస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రజల మనస్సులో చిరస్దాయిగా నిలిపేలా చేశారు. ఇందులో మీ పాత్ర ఏమీ లేదు. మీరు చేస్తున్న రాజకీయం రాజశేఖరరెడ్డికి తలవంపులు తెచ్చేలా ఉంది. నేడు రాష్ర్టంలో దోషిగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల మాట్లాడుతున్న పధ్దతి అత్యంత బాధాకరంగా ఉంది.రాజకీయాల కోసం మీరు ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు.వైయస్సార్ ను ఎఫ్ ఐ ఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.ఆయన చనిపోయాక ఛార్జ్ షీటులో అవినీతి పరుడుగా చిత్రించే ప్రయత్నం చేసింది. జగన్ గారిని 16 నెలలపాటు జైలులో ఉంచి బయటకు రాకుండా చూసిన పార్టీ.బెయిల్ రాకుిండా కుట్రలు చేసిన పార్టీ.ఆరోజు అలాంటి కాంగ్రెస్ పార్టీ గొప్పదిగా కనిపిస్తోంది.అలాంటి పార్టీని సమాధి దగ్గర పొగుడుతూ అభ్యర్దుల లిస్ట్ ప్రకటిస్తూ ఉంటే వైయస్ అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. షర్మిలను చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి. మిమ్మల్ని చూసి ఊసరవెల్లి లు సిగ్గుపడుతున్నాయి.మీరు ఇప్పుడు హంతకులు,హత్యారాజకీయాలు,చిన్నాన్న ఆఖరి కోరికలు ఇవి కాదు ఎన్నికలలో మాట్లాడాల్సింది.ఎన్నికలలో కడప ప్రజలకు ఏమి చేస్తారో మాట్లాడండి.కాంగ్రెస్ ద్రోహానికి క్షమాపణలు చెప్పి ముందుకు కదులుతున్నారా..ప్రజలకు ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో చెబుతారా...అలాంటి అంశాలపై ప్రజలకు సమాధానాలు చెప్పండి.మీరుగాని మీ పార్టీ నేతలు ఏపి ప్రజలకు సమాధానం చెప్పాలి.వాటిని దాటుకుని వెళ్లాలంటే కుదరదు.కాంగ్రెస్ దోషి.ఆ దోషి పాత్ర గురించి చర్చ జరగాల్సిందే.అని వాసిరెడ్డి పద్మ అన్నారు. జగన్ ప్రజలలో హృదయాలలో నిలిచారు. ఈరోజు జగన్ గారు ప్రజలతో మమేకం అయ్యారు.పార్టీ పెట్టినప్పటినుంచి అసెంబ్లీ,పార్లమెంట్,స్దానికసంస్దల ఎన్నికల వరకు ఆయన సాదించిన విజయాలే ఆయన నాయకత్వాన్ని నిరూపిస్తున్నాయి.చరిత్ర సృష్టించారు.ఈరోజు జగన్ గారు వస్తుంటే గంటల తరబడి ఎండల్లో వేచిచూస్తున్నారు.గుండెల్లో ఎంత అభిమానం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.అవినాష్ విషయంలో హంతకుడు అంటూ మాట్లాడటంపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని ఒక సమాధానంగా చెప్పారు. రాజకీయాలలోకి తను రావడం ఇష్టం లేదని వైయస్సార్ చెప్పినట్లు షర్మిలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షర్మిలే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అదేమంటే నాన్న(వైయస్సార్)కు నేను రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదు అని.....రాజకీయాలకు దూరంగా తనను ఉంచాలని కోరుకున్నారని కూడా చెప్పారు. కాని చిన్నాన్న ఏమో తను(షర్మిల) ఎంపి కావాలని కోరుకున్నారు. ఇంత విరుధ్దమైన కోరికలు...అంటే నాన్నను గౌరవిస్తారా...చిన్నాన్నను గౌరవిస్తారా....ఏంటి రాజకీయం. సమాధానం చెప్పాలని కోరారు.