రేపటి నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వార‌ దర్శనం

ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వార‌ దర్శనం కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి స్థానికులకు వైకుంఠ ద్వార‌ దర్శనం టోకెన్లు జారీ చేశామన్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదన్నారు. శ్రీవారి భక్తులపై లాఠీచార్జ్‌ జ‌ర‌గ‌లేద‌ని స్పష్టం చేశారు. 

Back to Top