పార్లమెంట్‌లోని వైయ‌స్ఆర్ సీపీ ఆఫీస్‌లో ఘ‌నంగా ఉగాది వేడుకలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘ‌నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డిని పార్టీ ఎంపీలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, లోక్‌స‌భ స‌భ్యులు కోటగిరి శ్రీధర్‌, ఆదాల ప్రభాకర రెడ్డి, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, శ్రీమతి వంగా గీత, శ్రీమతి గొడ్డేటి మాధవి, శ్రీమతి బి.సత్యవతి, శ్రీమతి చింతా అనురాధ పాల్గొన్నారు.

Back to Top