ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా సైన్యం..

తాడేప‌ల్లి: గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైయ‌స్ఆర్‌సీపీ ఎగైన్‌ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. దీంతో, పది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్‌ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. 

 
తన నాలుగేళ్ల పాలనలో వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన ట్వీట్లను వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు ట్వీట్‌ చేశారు. వీటికి దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్‌ వచ్చాయి. ఇటీవలి కాలంలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో యమా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతేడాది సీఎం వైయ‌స్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

Back to Top