వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ఓటు ద్వారా కృత‌జ్ఞ‌త‌లు 

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

నెల్లూరు:   సంక్షేమ ప‌థ‌కాల‌తో సంతోషంగా ఉన్న ప్ర‌జ‌లంతా కూడా తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైయ‌స్ ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తికి ఓటు వేసి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం గురుమూర్తి నామినేష‌న్ దాఖ‌లు చే‌సేందుకు ముందు నెల్లూరులోని పార్టీ కార్యాల‌యంలో దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు నెల్లూరులో గురుమూర్తి నామినేష‌న్‌కు పార్ల‌మెంట్ ప‌రిధి‌లోని ప్ర‌జ‌లంద‌రూ కూడా ఆశీర్వ‌చ‌నాలు అందించేందుకు త‌ర‌లివ‌చ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లంతా ‌సుఖంగా ఉన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు కృతజ్ఞ‌‌త‌లు తెలిపేందుకు ఓటు ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్ర‌జ‌లంద‌రూ కూడా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఓట్లు వేసేందుకు మేమంతా అండ‌గా ఉంటాం. దేశమంతా తిరుప‌తి వైపు చూ‌సేలా తీర్పు రాబోతుంది. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో గురుమూర్తి ప్ర‌జ‌ల క‌ష్టాలు ద‌గ్గ‌ర నుంచి చూశారు కాబ‌ట్టే..ఆయ‌న‌కు ఉప ఎన్నిక‌లో పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించార‌ని  వైవీ ‌సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top