పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

తిరుపతి: నేటి నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం త్వరితగతిన కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వ్యాధి ముమ్మరంగా ఉండటం వల్ల ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనభాగ్యం కల్పిస్తున్నామన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు జారీ చేశామన్నారు. ఒక్క రోజు కాకుండా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు దయచేసి కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

తాజా వీడియోలు

Back to Top