రుషికొండ‌లో నిర్మాణాల‌న్నీ చ‌ట్ట‌బ‌ద్ధంగా జ‌రుగుతున్నాయి

నిజాలు రాయ‌కుండా ఎల్లో మీడియా దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తోంది

ప్ర‌భుత్వ భూమిలో ప్ర‌భుత్వ భ‌వ‌నాలు నిర్మిస్తుంటే బాబు, ప‌వ‌న్‌ల బాధేంటీ..?

పర్యాటక మంత్రి ఆర్కే రోజా 

తిరుప‌తి: రుషికొండలో నిర్మాణాలన్నీ చట్టబద్ధంగా జరుగుతున్నాయని ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం భవనాలు కడుతుంటే మధ్యలో పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబుకు వచ్చిన బాధేంటో అర్థం కావడంలేదన్నారు. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని నిన్న అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించిన వివరణ ఇచ్చాన‌ని, కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు, చూపించ‌లేద‌న్నారు. అందుకే మరోసారి ఈ నిర్మాణాలపై స్పష్టత ఇస్తున్నానని, నిన్న మీడియా స‌మావేశంలో చెప్పిన మాట‌లు  ఈనాడు దినపత్రికకు కరెక్టుగా వినిపించకపోతే మళ్లీ చెప్తున్నా.. తాను చెప్పిన నిజాలు రాయాల‌న్నారు. 

మంత్రి ఆర్కే రోజా ఏం మాట్లాడారంటే..
రుషికొండలో భూమి ప్రభుత్వ భూమి, పర్యాటక శాఖకు సంబంధించిన భూమి. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాలకోసం ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చారు. ఇందులో కూడా మేం నిర్మాణాలు చేప‌డుతున్న‌ది వలం 2.7 ఎకరాల లోపలే. 7 భవన నిర్మాణాలకు అనుమతులు వస్తే కేవలం 4 భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వ‌న్‌. అధికార వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. ఇక్కడ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఎక్కడ నివాసం ఉండాలి? భద్రత ఎలా ఉండాలి? పరిపాలన చేసే కార్యాలయం ఎక్కడ ఉండాలి? ఈ అంశాలను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కమిటీ తీసుకునే నిర్ణయానుసారం అన్నీ జరుగుతాయి. 

రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. గౌరవ హైకోర్టు రుషికొండ నిర్మాణాలపై ఏమైనా సూచనలు చేస్తే వాటినికూడా పాటిస్తాం. అలాంటప్పుడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల బాధేంటో అర్థంకావడంలేదు. ఒక పర్యాటకశాఖ మంత్రిగా, అధికారికంగా ఈ వివరాలన్నింటినీ నేను మీడియాకు వెల్లడిస్తే.. వాటిని ఎందుకు రాయలేదు? ఈనాడు దినపత్రిక ఎందుకు దిగజారిపోయింది? ప్ర‌జాప్రతినిధిగా ఏ హోదా లేని వాడు, కనీసం వార్డు మెంబర్‌కూడా కాని పవన్‌కళ్యాణ్‌ మాట్లాడిన మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా..? కాని మేం చెప్పే నిజాలకు పాతరేయాలని? అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు ప్రజలు భరతం పడతారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వీరు అడ్డుపడుతున్నారు. రుషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు, లోకేష్‌ తోడల్లుడు ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ కబ్జాచేస్తే… పవన్‌ కళ్యాణ్‌ నోట్లో హెరిటేజ్‌ ఐస్‌క్రీం పెట్టుకున్నాడా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్‌ ఆస్పత్రిలో చేరేట్టు ఉన్నాడు.

Back to Top