కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏం చేస్తున్నారు. రజినీ పీఏ పై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి?. మహిళా మాజీ మంత్రి అనేది చూడాకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం. అత్యుత్సాహంతో పోలీసులు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇలాగే రెడ్ పాలన కొనసాగితే, వైయస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్‌లో ఎలా పెడతారు?’’ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. 84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడతల రజినిపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాం’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు నమోదు చేసి.. పలు జిల్లాల్లో తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు.