13న‌ కళ్ళితండాకు వైయ‌స్ జగన్ 

తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎల్లుండి(మంగళవారం, మే 13వ తేదీ)కళ్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన సంగతి తెలిసిందే.  

ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్  కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి వైయ‌స్ జ‌గ‌న్‌ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
 

Back to Top