రేపు వైయ‌స్ఆర్ నేత‌న్న నేస్తం

తాడేప‌ల్లి: నాలుగో విడత నేతన్న నేస్తానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 25న గురువారం వైయ‌స్ఆర్ నేత‌న్న నేస్తం 4వ విడ‌త కార్య‌క్ర‌మాన్ని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. నాలుగో విడతలో 80,546 మంది లబ్ధిదారులకు..193.31 కోట్లు జమ చేయనున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం చేనేతలకు వైయ‌స్సార్‌నేతన్న నేస్తం అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి యేటా రూ. 24 వేల నగదు సాయం అందుతోంది. తొలి విడతలో ఎవరికైనా సాంకేతిక కారణాలతో సాయం అందకపోతే తిరిగి మళ్లీ అందజేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో నాల్గవ విడత నేతన్న నేస్తం నగదును ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా చేనేతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ. 72 వేల సాయం అందింది.   

Back to Top