రేపు, ఎల్లుండి సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నమయ్య, వైయ‌స్ఆర్‌ జిల్లాల పర్యటన

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు, ఎల్లుండి (09.11.2023, 10.11.2023) అన్నమయ్య, వైయ‌స్ఆర్‌  జిల్లాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. 

09వ తేదీ షెడ్యూల్‌

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమం, ఆ తర్వాత ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్‌ విజిట్, ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.  

10వ తేదీ షెడ్యూల్‌

ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్‌ కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్‌ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top