నేడు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
 

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్లు పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్‌చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంట్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధకార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top