జగన్‌ అనే నేను.. నేటితో మూడేళ్లు పూర్తి

తాడేపల్లి: సరిగ్గా మూడేళ్ల క్రితం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో దిక్కులన్నీ పిక్కటిల్లేలా జై జగన్‌ నినాదం సింహగర్జనలా మార్మోగింది. లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది జనం సాక్షిగా ‘జగన్‌ అనే నేను’ అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గర నుంచి విని, చూసి.. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజల్లో ధైర్యం నూరిపోసిన వైయస్‌ జగన్‌కు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. ఓటు అనే ఆయుధంతో తమ పాలకుడిగా వైయస్‌ జగన్‌ను ఎంచుకున్నారు. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లను కట్టబెట్టి.. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే సువర్ణ విజయాన్ని వైయస్‌ జగన్‌ ఖాతాలో వేశారు. 

ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన సాగింది. తాను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల ప్రణాళికను పవిత్ర గ్రంథంగా భావిస్తూ వచ్చారు సీఎం వైయస్‌ జగన్‌. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే మేనిఫెస్టోలోని హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశారు. క‌రోనా వంటి మ‌హ‌మ్మారి రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై విప‌రీత‌మైన దాడి చేస్తున్నా.. మొక్క‌వోని ధైర్యం.. ధృడ సంక‌ల్పంతో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కొన‌సాగించారు. ఒక‌ప‌క్క ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితిపై దృష్టి కేంద్రీక‌రిస్తూనే.. మ‌రోప‌క్క రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌బెట్ట‌డం, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు, ప్ర‌జ‌ల‌కు ఆర్థిక‌సాయం వంటి కార్య‌క్ర‌మాలు చేశారు. ప్ర‌త్య‌ర్థులు, వాటిని మోసే మీడియా య‌జ‌మానులు ప్ర‌భుత్వంపై ముకుమ్మ‌డిగా దాడికి తెగ‌బ‌డినా.. చిరున‌వ్వు చెద‌ర‌కుండా.. ప్ర‌త్య‌ర్థుల ఎత్తును చిత్తు చేస్తూ.. వారి విష‌ప్ర‌చారాన్ని ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌లకు చూపుతూ త‌న‌దైన శైలిలో ప‌రిపాల‌న సాగిస్తున్న సీఎం ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. 

కార్పొరేష‌న్లు, డైరెక్ట‌ర్లు..

అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా మంత్రివ‌ర్గం మొద‌లు నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు పెద్ద‌పీట వేశారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఈ మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు, అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏకంగా రూ.1,84,930.60 కోట్లను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. సంక్షేమ పథకాలకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,41,247.94 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. నాన్‌ డీబీటీ పథకాల ద్వారా రూ.43,682.65 కోట్ల ఖర్చు చేశారు.

బీసీల కోసం

నవరత్నాల్లోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల ద్వారా బీసీల కోసం రూ.89,024.67 కోట్లు వెచ్చించారు. ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.65,973.10 కోట్లు అందజేశారు. అభివృద్ధి పథకాల కింద నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.23,051.56 కోట్లు వెచ్చించారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీ లబ్ధిదారులే. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద 24.61 లక్షల బీసీ రైతులకు రూ.9,369.86 కోట్లు అందజేశారు. 
 
ఎస్సీ వర్గాలకు భారీ వ్యయం 
నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే  ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.31,153.95  కోట్లు వ్యయం చేసింది. ఇందులో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీతో రూ.22,528.04 కోట్లను జమ చేయగా.. నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.8,625.91 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 5.23 లక్షల ఎస్సీ రైతులకు రూ.2063.70 కోట్లు ఇచ్చారు. 6.36 లక్షల ఎస్సీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.5589 కోట్లు వ్యయం చేశారు. 

ఎస్టీల సంక్షేమానికి  రూ.9,243.68 కోట్లు 
ఎస్టీల అభివృద్ది, సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.9,243.68 కోట్లు వ్యయం చేశారు. ఇందులో సంక్షేమ  పథకాల ద్వారా నేరుగా రూ. 7,035.51 కోట్లు నగదు బదిలీ చేయగా.. నగదేతర పథకాల ద్వారా మరో రూ.2,208.17 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 3.92 లక్షల ఎస్టీ రైతులకు రూ. 1346.95 కోట్లు నగదు బదిలీ చేశారు. అలాగే 1.41 లక్షల ఎస్టీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.1242 కోట్లను వ్యయం చేశారు. 

మైనారిటీల కోసం రూ..8,595.50 కోట్లు 
చంద్రబాబు సర్కారులో మైనారిటీలంటే ఓటు బ్యాంకు మాత్రమే. జగన్‌ మూడేళ్లలో వారి సంక్షేమం, అభివృద్ది కోసం రూ.8,595.50 కోట్లు వ్యయం చేశారు. ఇందులో నేరుగా రూ.5,456.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయగా... మరో రూ.3,138.74 కోట్ల మేర ప్రయోజనాలు ఇతర పథకాల ద్వారా అందాయి. 2.52 లక్షల మంది మైనారిటీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.2,214 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 60 వేల మైనారిటీ రైతులకు రూ.251.75 కోట్లు ఇచ్చారు.  

కాపుల కోసం రూ.14,438.78 కోట్లు 
చంద్రబాబు సర్కారు కాపులను రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టి వంచించగా జగన్‌ సర్కారు ఆచరణ సాధ్యమైన హామీలనే ఇచ్చి మూడేళ్లలో అమలు చేసి చూపించింది. కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.14,438.78 కోట్లు వెచ్చించారు. దీన్లో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.12,011.50 కోట్లు నగదు బదిలీ చేశారు. ఇతర పథకాల ద్వారా మరో రూ. 2,427.20 కోట్ల మేర ప్రయోజనాలు అందాయి. 2.46 లక్షల మంది కాపుల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.2,160 కోట్లు వ్యయం చేశారు. వైయ‌స్సార్‌ రైతు భరోసా కింద 7.85 లక్షల కాపు రైతులకు రూ.2923.59 కోట్లు ఇచ్చారు.  

అగ్రవర్ణ పేదలకు రూ.28,716.02 కోట్లు 
పేదరికానికి కులం, మతం లేదని గట్టిగా నమ్మిన సీఎం వైయ‌స్‌ జగన్‌...  అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం మూడేళ్లలో రూ.28,716.02 కోట్లు వ్యయం చేశారు.   

స‌చివాల‌యాలు, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. అవినీతి, వివ‌క్ష లేని పార‌ద‌ర్శ‌క పాల‌న‌కు నాంది ప‌లికింది. క‌రోనా స‌మ‌యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషించింది. గ‌డ‌ప వ‌ద్ద‌కే పెన్ష‌న్ పంపిణీ మొద‌లు.. కోవిడ్ స‌మ‌యంలో 44 సార్లు ఇంటింటి స‌ర్వే చేయ‌డంలోనూ వ‌లంటీర్లు ఘ‌న‌మైన పాత్ర పోషించారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ దేశ వ్యాప్తంగా ప్ర‌శంస పొందింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top