కమలాపురం నగర పంచాయతీలో ఉద్రిక్తత

వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ నరేన్‌రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నం

వైయ‌స్ఆర్ జిల్లా: కమలాపురం నగర పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ నరేన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ వర్గాల నుంచి ముప్పు ఉందంటూ పార్టీ కార్యాలయం నుంచి ఆయనను తరలించేందుకు పోలీసులు యత్నించడంతో నరేన్‌రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు.

టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడితే వారిపై చర్యలు తీసుకోకుండా, తమ పార్టీ నాయకుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం ఏమిటని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రశ్నించాయి. భద్రత పేరుతో తమ నాయకులను నిర్బంధించే ప్రయత్నాలు చేయడం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు సమానంగా చట్టాన్ని అమలు చేయాలని, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు.

Back to Top