లోకేష్‌ను సీఎం చేసేందుకు నారా భువనేశ్వరి క్షుద్రపూజలు 

ఆలయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కుటుంబానికే లేదు

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి

తిరుమల: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిన్నటి వరకు కులం కార్డు వాడిని చంద్రబాబు.. నేడు మతం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నాడని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం చేస్తుంటే వారు ఎంత హీనస్థితికి దిగజారారో అర్థం అవుతుందన్నారు. తిరుమలలో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. లోకేష్‌ను సీఎం చేసేందుకు నారా భువనేశ్వరి క్షుద్రపూజలు చేయించింద‌ని ఆరోపించారు. దేవాల‌య సంప్ర‌దాయాల‌ను పూర్తిగా నాశ‌నం చేసిన చంద్ర‌బాబుకు ఆల‌యాల గురించి మాట్లాడే అర్హ‌త లేదు. విజయవాడ దుర్గమ్మవారి గుడిలో, కాళహస్తిలో క్షుద్రపూజల గురించి బీజేపీ నేతలు అడగాలన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికలోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి స్థానం నుంచి దింపేందుకు కాంగ్రెస్‌ మతపరమైన అల్లర్లు సృష్టించింది. చంద్రబాబు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి కాంగ్రెస్‌ కల్చర్‌ పోలేదన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top