వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన వాసుపల్లి గణేష్‌ కుమారులు

తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ కుమారులు వాసుపల్లి సాకేత్, వాసుపల్లి సూర్యలు ముఖ్యమంత్రి సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాసుపల్లి సూర్య, సాకేత్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top