నగరిలో టీడీపీ నాయకుల అరాచకం..

దళితులకు అండగా నిలిచిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడి

చిత్తూరు:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎక్క‌డ చూసినా విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లూ దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడమేగాక ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేశారు. తాజాగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితులు ఊరు విడిచి వెళ్లిపోవాలంటూ టీడీపీ నేత‌లు హుకుం జారీ చేశారు. వారికి అండ‌గా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై అధికార పార్టీ నేత‌లు దాడి చేయ‌డ‌మే కాకుండా అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌డుకుపేట‌లో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో వివాదం చెల‌రేగింది. ఈ గొడ‌వ‌లో టీడీపీ నేత‌లు ఎంట‌రై దళితులు ఊరు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో దళితులకు అండ‌గా నిలిచిన‌ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై ప‌చ్చ మూక‌లు దాడికి తెగ‌బ‌డ్డారు. తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పైనే కేసులు పెట్టారు.  టీడీపీ నేత‌ల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

Back to Top