వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత స‌తీష్‌రెడ్డి

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో పులివెందుల టీడీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న‌మండ‌లి మాజీ డిప్యూటీ చైర్మ‌న్ ఎస్‌.వీ.స‌తీష్‌కుమార్‌రెడ్డి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను స‌తీష్‌కుమార్‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌రం సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. స‌తీష్‌కుమార్‌రెడ్డికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో కడప ఎంపీ వైయ‌స్‌.అవినాష్‌ రెడ్డి, వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, పలువురు స్థానిక నేతలు ఉన్నారు.

Back to Top