టీడీపీ నేత కాశీ విశ్వ‌నాథ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

విశాఖ‌:  టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస్ ప్ర‌ధాన అనుచ‌రుడు కాశీ విశ్వ‌నాథ్ వైయ‌స్ఆర్‌సీపీ  తీర్థం పుచ్చుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి స‌మ‌క్షంలో కాశీ విశ్వ‌నాథ్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో సుప‌రిపాల‌న చూసి కాశీ విశ్వ‌నాథ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరార‌ని విజ‌యసాయిరెడ్డి తెలిపారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 90 శాతం ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీకి ప‌ట్టం క‌ట్టార‌ని చెప్పారు. జీవీఎంసీ ఎన్నిక‌ల్లో విజ‌యం  ‌సాధిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

టీడీపీలో చాలా ఇబ్బందులు ప‌డ్డా:  కాశీ విశ్వ‌నాథ్‌
తెలుగు దేశం పార్టీలో చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని కాశీ విశ్వ‌నాథ్ పేర్కొన్నారు. టీడీపీలో ప‌ద‌వులు ఆశ చ‌పి చివ‌రికి మోసం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు ఆక‌ర్శితుడినై వైయ‌స్ఆర్‌సీపీ లో చేరాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంక్షేమంగా ఉన్నార‌ని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top