వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత ఆనం జ‌య‌కుమార్‌రెడ్డి

తాడేప‌ల్లి: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆనం జ‌య‌కుమార్‌రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన జ‌య‌కుమార్‌రెడ్డి.. సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు ఆనం జ‌య‌కుమార్‌రెడ్డికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ నేత కోటిరెడ్డి ఉన్నారు.

Back to Top