ఆర్టీసీకి టీడీపీ ప్రభుత్వం అన్యాయం 

దురాలోచనలతో ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారు

టీడీపీ కార్యక్రమాల కోసం ఆర్టీసీని వాడుకున్నారు

ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దు..

వైయస్‌ జగన్‌ సారథ్యంలో ఆర్టీసీకి బంగారురోజులు రాబోతున్నాయి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పార్థసారధి

విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీకి అన్యాయం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ నేత పార్థసారధి  మండిపడ్డారు.చంద్రబాబు,వారి తాబేదారులు ఆర్టీసీని మింగేదామని చూస్తున్నారని  ధ్వజమెత్తారు. విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ అస్తిత్వమే డోలాయమానంలో పడిపోయిందన్నారు. ప్రభుత్వ విధానాలు,నిర్ణయాలతో ఆర్టీసీ మనుగడ సాగించడం కష్టంగా మారిందన్నారు. సుమారు  60వేల మంది ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను కాపాడుకోవడానికి  అహర్నిశలు కష్టపడుతూ  చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.

ఆర్టీసీలో నెలకొన్న  పరిస్థితులతో  కార్మికులు,వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో  ఉన్నారన్నారు. ఆర్టీసీ మూసివేసే పరిస్థితి వస్తే గ్రామాల్లో ట్రాన్స్‌పోర్ట్‌ పరిస్థితి ఎలా ఉంటుందోనని  గ్రామాల్లో చర్చ జరుగుతుందన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు ఆలోచన ధోరణి ఉందని స్పష్టమవుతుందన్నారు. చంద్రబాబుకు,వారి తాబేదారులకు హాయ్‌ల్యాండ్‌ మీద మక్కువ ఉందని..అదేవిధంగా ఆర్టీసీ మీద కూడా కన్ను పడిందన్నారు.టీడీపీ ప్రభుత్వం విధానాల ద్వారా ఆర్టీసీకి నష్టం కలిగించి కబళించివేయాలనే ఒక దురాలోచన ఉందన్నారు. ఆర్టీసీకి చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు.

 పెట్టుబడుదారులకు పన్ను రూపంలో వేల కోట్ల రాయితీలు కల్పించారని, వేల కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా పెట్టుబడుదారులకు అప్పజెప్పారన్నారు. తన 14 సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు ఆర్టీసీని నష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఒక చర్య కూడా తీసుకోలేదన్నారు.నష్టాల నుంచి గటెక్కించే చర్యలు తీసుకోకపోక ఆర్థిక భారాలు మోపారన్నారు.పారిశ్రామిక వేత్తలు,కాంట్రాక్టర్లకు,పెట్టుబడుదారులకు వెసులుబాటు కల్పించిన చంద్రబాబు..ఎంవీ ట్యాక్స్‌ మీద కొంత రాయితీ కల్పించమని ఆర్టీసీ కోరితే ఎప్పడైనా ఒక రూపాయి అయినా తగ్గించారా అని ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా  అత్యధికంగా  డిజిల్‌పై ట్యాక్స్‌ విధిస్తున్నారని తెలిపారు.

ఆర్టీసీకే కాకుండా పేదలకు కూడా భారం కలిగించే విధంగా ట్యాక్స్‌లు వేస్తున్నారన్నారు.ఇతర రాష్ట్రాలతో పోల్చితే  డీజీల్‌పై ఉన్న  అధిక ట్యాక్స్‌ తగిస్తే ఆర్టీసీకి వందల కోట్ల లాభం చేకూరే అవకాశం ఉందన్నారు.దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.పక్క రాష్ట్రాల్లో ఇంధనంలో లాభం వచ్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారని,అటువంటి ప్రయత్నాలు కూడా ఏపీ ప్రభుత్వం చేయడంలేదన్నారు.దీనికి తోడు పోలవరం సందర్శన, నవనిర్మాణ దీక్షలు,ధర్మపోరాట దీక్షలకు,డ్వాక్రా మహిళా సమావేశాలకు వేల బస్సులు నడిపారన్నారు.టీడీపీ పార్టీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఆర్టీసీని వాడుకున్నారు. నేడు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అప్పుపడిందన్నారు.

సోకుల కోసం, ప్రాపకం కోసం పుష్కరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన చంద్రబాబు ఆర్టీసీకి కనీసం 100 కోట్ల అయినా చెల్లించాడా అని ప్రశ్నించారు.ఆర్టీసీని గట్టెక్కించాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ఒకటే మార్గమన్నారు.దాదాపు 60వేల కార్మికుల సంక్షేమం గురించి ఆయన ఆలోచించారు.గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేశారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆలోచన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేశారన్నారు.కార్మికులు,యాజమాన్యం ఆందోళన చెందవద్దని..ఆర్టీసీకి రాబోయేది బంగారు రోజులు అని అన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top