టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారు

ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన 

ఈసీని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేత నాగిరెడ్డి

అమరావతి: డెప్యుటేషన్‌పై ఎన్నికల విధుల్లో ప్రభుత్వం నియమించిన టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు.సీఈవో ద్వివేదిని కలిసిన సందర్భంగా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసీ తాఖీదులకు సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన చేస్తున్నారన్నారు. టీడీపీ కోడ్‌ ఉల్లంఘనపై అన్ని ఆధారాలు ఈసీకి అందజేశామని తెలిపారు. మాకు ఇచ్చిన అన్ని నోటీసులకు సమాధానాలు ఇచ్చామన్నారు. టీడీపీ ఒక్క నోటీసుకు కూడా స్పందించలేదన్నారు.

 

Back to Top