రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ బాపట్ల జిల్లాలో పర్యటన

 యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం

గుంటూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(21.12.2022) బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించ‌నున్నారు. యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్ధులకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్యాబ్‌లు పంపిణీ చేయ‌నున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 – 1.00 వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top