ఏపీపీఎస్సీ సభ్యులుగా సుధాకర్‌రెడ్డి, సలాంబాబు 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా  జీవీ సుధాకర్‌రెడ్డి,  షేక్‌ సలాంబాబు నియమితులయ్యారు.  జీవో 127 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సలాంబాబు వైయస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థి, యువజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఎన్నో పోరాటాలు, ఉద్యమా లు నిర్వహించారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్‌ వంటి సమస్యలపై పో రాటాలు నిర్వహించారు.   ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులైన షేక్‌ సలాంబాబుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అభినందనలు తెలిపారు.  
 

Read Also:  ఎంపీ మాధవి,  శివప్రసాద్‌ దంపతులను సీఎం వైయస్‌ జగన్‌ ఆశీస్సులు

Back to Top