ఎంపీ మాధవి,  శివప్రసాద్‌ దంపతులను సీఎం వైయస్‌ జగన్‌ ఆశీస్సులు

 విశాఖలో జరిగిన అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం

విశాఖ: ఈనెల 17న వివాహం చేసుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, శివప్రసాద్‌ దంపతులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీర్వదించారు. అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి రిసెప్షన్‌ మంగళవారం విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.   నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. మాధవి, శివప్రసాద్‌ దంపతులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పాదాభివందనం చేశారు.  ఎయిర్‌పోర్టులోనూ, వివాహ రిసెప్షన్‌ వేదిక వద్ద.. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ సీఎం ఆత్మీయంగా పలకరించారు.  కేకే రాజు ది గ్రేట్‌.. అంటూ ఉత్తర నియోజకవర్గ అభ్యర్ధి కేకే రాజును, గౌరమ్మా ఎలా ఉన్నావంటూ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరిని, గురువులన్నా ఎలా ఉన్నావ్‌.. అంటూ కోలా గురువులును.. ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి ప్రేమగా పలకరించారు. వివాహానికి హాజరైన  పార్టీ శ్రేణులకు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. రిసెప్షన్‌కు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు డా.భీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గోరంట్ల మాధవ్, డా.సంజీవ్‌కుమార్, చంద్రశేఖర్, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, పార్టీ నేతలు అక్కరమాని విజయనిర్మల, పరిక్షిత్‌ రాజు, కుంభా రవిబాబు, కొయ్య ప్రసాదరెడ్డి, సతీష్‌వర్మ, సుధాకర్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు.   

Read Also: పచ్చ చొక్కాల పరిరక్షణే టీడీపీ ధ్యేయం

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top