రైతుల బాధలు వర్ణనాతీతం

మాజీ మంత్రి కాకాణి 
 

నెల్లూరు :  కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు స‌కాలంలో ఎరువులు, విత్త‌నాలు ల‌భించ‌డం లేద‌ని, వారి బాధ‌లు వ‌ర్ణ‌ణాతీత‌మ‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని మొగుళ్లూరు గ్రామం, మనుబోలు మండలంలోని కట్టువపల్లి, మడమనూరు, గొట్లపాలెం గ్రామాలలో కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి బుధ‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతుల‌కు యూరియా లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు.  
కాకాణి ఇంకా ఏమ‌న్నారంటే.. 
* కూటమి పాలనలో రైతుల బాధలు వర్ణనాతీతం
* యూరియా అందక రైతులు పడ్డ తీవ్ర ఇబ్బందులు
* టీడీపీ నేతలు యూరియాను వ్యక్తిగత ప్రయోజనానికి సొమ్ముగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం దుర్మార్గం
* సోమిరెడ్డి ఇరిగేషన్‌లో పనులు చేయకుండా దోపిడీ; యూరియాను బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు
* రైతులకు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత
* ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకుని పంటలను రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేయడం తప్పనిసరి
* వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతులపై అండగా నిలుస్తూ, సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతుంది
* కూటమి పాలనలో కొత్త పెన్షన్లు మంజూరు కాక, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
* గ్రామాలకు రహదారులు, అంతర్గత సిమెంట్ రోడ్లు పూర్తిగా నిర్మాణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో జరిగింది
* కూటమి పాలనలో గ్రామ రహదారులు గుంతలమయం అయ్యాయి
* ప్రజలలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
* ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి పాలన గుర్తు చేసుకుంటూ, మళ్లీ ముఖ్యమంత్రిగా చూచుకోవాలని అంచనాలు
* వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు సమస్యలు రాకుండా, మెరుగైన వసతి, సదుపాయాలను అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది 

Back to Top