జోగి ర‌మేష్‌కు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప‌రామ‌ర్శ 

ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ  మహ్మద్ రుహుల్లా ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల ఆయ‌న ఇంటిపై జ‌రిగిన దాడిని ఈ సంద‌ర్భంగా వారు తీవ్రంగా ఖండించారు.  అంజాద్ బాష మీడియాతో మాట్లాడుతూ, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోంద‌ని విమ‌ర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి అందుకు నిద‌ర్శ‌నం అన్నారు. దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ, రాష్ట్రంలో రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. 76 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో జరగని సంఘటనలు చూస్తున్నాము. అంతమొందించాలనే ఉద్దేశంతోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారని త‌ప్పుప‌ట్టారు.  రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందో లేదో ప్రజలకు అర్థం కావడం లేద‌ని అన్నారు. దాడులకు పాల్పడుతున్న గుండాలకు రక్షణగా నిలుస్తున్న పోలీసులు, శివ భక్తులపై దాడి చేసేందుకు లాఠిలను ఉపయోగిస్తున్నారు, గుండాలను నియంత్రించేందుకు కాదు అని అన్నారు. 

Back to Top