కొత్త జిల్లాల‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ

క‌ర్నూలు: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు అన్ని వ‌ర్గాల నుంచి విశేష మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటును హర్షిస్తూ ..క‌ర్నూలు జిల్లా పత్తికొండలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నేతృత్వంలో పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, దివంగత నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ధికి బాటలు వేశారని ఎమ్మెల్యే శ్రీ‌దేవి కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టడం జగనన్న మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఈ సందర్భంగా అన్నారు. నీచమైన ఆలోచనతో చంద్రబాబు ముందుకు పోతుంటే, జగనన్న మాత్రం ఆదర్శవంతంగా పాలన సాగిస్తున్నారని చెప్పేందుకు ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడమే నిదర్శనమని ఎమ్మెల్యే  అన్నారు.  కార్యక్రమంలో పత్తికొండ ఎంపీపీ నారాయణ దాస్ , తుగ్గలి జడ్పిటిసి పులికొండ నాయక్, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , పత్తికొండ తుగ్గలి మండల కన్వీనర్లు బజారప్ప, జిట్టా నాగేష్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, మాజీ సర్పంచ్ సోమశేఖర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ నాయక్,తుగ్గలి మండలం నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, యువజన నాయకులు రాతన మోహన్ రెడ్డి, తుగ్గలి మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్లమెంటరీ రైతు సంఘం అధ్యక్షులు గంపల వెంకటేశ్వర్లు, సర్పంచులు,మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ ఎంపీటీసీలు  వార్డు మెంబర్లు,కార్యకర్తలు  పాల్గొన్నారు

Back to Top