జగన్‌ మామయ్య సీఎం కావడం మా వరం

రాణిగారితోటలో సీఎం వైయస్‌ జగన్‌ మాస్క్‌లతో విద్యార్థుల ర్యాలీ

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దేవినేని అవినాష్, చిన్నారులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జగన్‌ మామయ్య ముఖ్యమంత్రి కావడం మా వరం అని విద్యార్థులు అంటున్నారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలుతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడలోని రాణిగారితోటలో వైయస్‌ఆర్‌ సీపీ నేత దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్‌ల ఆధ్వర్యంలో చిన్నారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాస్క్‌లు ధరించి ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్‌ మామయ్య అంటూ నినదించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఒక తల్లి తన దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకొని మా ఆయన రోజుకు రూ.200 సంపాదిస్తున్నారు.. మా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే కోరిక ఉండేది.. జగన్న మా పిల్లలకు రూ.15 వేలు ఇచ్చి చదివిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. మా జగన్‌ మామయ్య మమ్మల్ని ఆదరించారని పిల్లలే చెబుతున్నారు.  అమ్మ ఒడి కార్యక్రమంతో దేశంలోని ముఖ్యమంత్రులు అందరూ వైయస్‌ జగన్‌ వైపు చూసేలా చేశారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైయస్‌ జగన్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏం పెట్టాలో మెనూ కూడా ఆయనే సిద్ధం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు జోలె పట్టుకొని డబ్బులు వసూలు చేసినా మళ్లీ ఈ రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారన్నారు. 
 

Back to Top