మహనేత వైయ‌స్ఆర్ విగ్ర‌హం ధ్వంసం

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బల్లికురవ మండలం కొప్పెరపాలెంలో దివంగ‌త మ‌హానేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని  ధ్వంసం చేశారు. వైయ‌స్సార్‌ విగ్రహానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వైయ‌స్సార్‌ విగ్రహం దెబ్బతినడమే కాకుండా మసిబారింది.

వైయ‌స్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది టీడీపీ నేతలు చేసిన పనే అని వైయ‌స్సార్‌ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top