దళితులను కించపరిచిన బాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా...?

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ 

దళితులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు క్షమాపణలు చెప్పండి

దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నను చెప్పుతో కొట్టి మాట్లాడండి.

కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య

దళితులకు కనీసం క్షమాపణలు చెప్పకుండా తిరగడానికి సిగ్గుండాలి

మంత్రి  ఆదిమూలపు సురేష్‌

ఎన్నికల కోసమే చంద్రబాబు కుల సమావేశాలు

దళితుల్ని చీల్చి చిచ్చుపెట్టేందుకే టీడీపీ కుయుక్తులు

ఈ ఎల్లో తోడేళ్ల గుంపులో దయచేసి దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దు.

 మీరు దళితులను అసహ్యించుకుంటే..జగన్‌ గారు అందలం ఎక్కించారు

ఎన్నికలకు మూడు నెలల మందు డప్పు కళాకారులకు రూ.1500 పింఛన్‌ ఇచ్చి డప్పు కొట్టుకుంటున్నారు. 

మీరిచ్చిన 6 వేల పింఛన్లు ఎక్కడ..? మేమిస్తున్న 56 వేల పింఛన్లు ఎక్కడ..?

మంత్రి ఆదిమూలపు సురేష్‌

దళిత సంక్షేమంపై చర్చకు మేము సిద్ధం..మీరు సిద్ధమా చంద్రబాబూ..?

అసెంబ్లీకి రండి..ఎవరేం చేశారో చర్చించుకుందాం.

ప్రతి పథకంలో దామాషాకు మించి మా వాటా అందుతోంది

దేవాలయ బోర్డుల్లో దళితులకు స్థానం కల్పించిన ఘనత జగనన్నదే. 

దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు రాజకీయ సాధికారత ఇచ్చింది జగనన్నే

చంద్రబాబు ఎన్నికల హామీలు చూసి ప్రజలు.. నీకో దండం బాబూ అంటున్నారు: మంత్రి  ఆదిమూలపు సురేష్‌

తాడేప‌ల్లి:  దళితులను కించపరిచిన చంద్ర‌బాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా...? అని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ ప్ర‌శ్నించారు.  కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిప‌డ్డారు.  ఉన్నట్లుండి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు కులాల సమావేశాలు ఎందుకు గుర్తొచ్చాయని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.   చంద్రబాబుకు తన వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎన్నడూ పట్టవ‌ని విమ‌ర్శించారు.  ఇప్పటికిప్పుడు ఆయనకు కులాల ప్రస్థావన గుర్తుకువస్తోందంటే ఎన్నికల కోసమే అనేది సుస్పష్టమ‌న్నారు. బుధ‌వారం వైయ‌స్ఆర్‌షీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఏమ‌న్నారంటే..
- కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 
- దళిత పేదవర్గాలను చిన్నచూపు చూసి, వారిని వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు. 
- ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు ఆయనకు అట్టడుగు వర్గాలపై ప్రేమ పుట్టుకొస్తుంది. 
- టీడీపీ వారికి దళితుల పట్ల ఉన్న అభిప్రాయం ఎలాంటిదో గతంలో వారు మాట్లాడిన మాటలే నిదర్శనం. 
- కానీ వారికి మాత్రం సిగ్గనిపించడం లేదు. గతంలో వారు మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోలేదు. 
- డప్పు పట్టుకుని మాదిగ సామాజికవర్గాన్ని మేలుకొల్పాలని ఆత్మీయ సమ్మేళనం పెట్టి మాట్లాడుతున్న వారు.. గతంలో మాదిగలపై ఏం మాట్లాడారో గుర్తుకు చేసుకోవాలి. 

దళితులకు కనీసం క్షమాపణలు చెప్పకుండా తిరగడానికి సిగ్గుండాలి:
- చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడాడు.
- అప్పటి చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు సరిగ్గా చదవరు.. శుభ్రంగా ఉండరని మాట్లాడారు.  
- మీకెందుకురా పిచ్చోళ్లారా రాజకీయాలు..రాజకీయాలు పదవులు మా కోసం అంటూ చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడింది వాస్తవం కాదా..? 
- నిన్న డప్పు కొట్టిన వర్లరామయ్య మాదిగ నాకొడుకులకు చదువురాదు అంటూ గతంలో మాట్లాడాడు. 
- ఒక దళిత మహిళ గొంతుమీద బూట్‌ కాలు పెట్టి తొక్కి అవమానపరిచిన అచ్చెన్నాయుడు ఈ రోజు దళితులంటూ డప్పు కొట్టడం విడ్డూరంగా ఉంది.  
- ఇలాంటి దళిత ద్రోహులంతా నేడు మా నాయకుడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. 
- మీరు మాట్లాడిన మాటలకు కనీసం క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో తిరుగుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో అర్ధం కావడం లేదు. 
- దళితులను రెచ్చగొట్టే విధంగా మాదిగలు, మాలల సమావేశాలు పెట్టడానికి మీకు సిగ్గనిపించడం లేదా..? 

మీరు దళితులను అవమానిస్తే..జగన్‌ గారు అందలం ఎక్కించారు:
- మీరు దళితులను అసహ్యించుకుంటే మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ వారిని అక్కున చేర్చుకుని అందలం ఎక్కించారు. 
- జగనన్న మా మాదిగలకు పదవుల్లో అగ్ర పీఠం, పథకాల్లో అగ్రస్థానం ఇచ్చారు. 
- డప్పు కళాకారులకు, చర్మకళాకారులకు పింఛన్‌ మేమిచ్చాం అని చెప్పుకుంటున్నారు. 
- మీరు చెప్పే మాటల్లో వాస్తవాలెంతో ప్రజలంతా గమనించాలి.  
- 2018 జూన్‌లో అంటే ఎన్నికలు మరో ఆరు నెలలు ఉండగా డప్పు కళాకారులకు పింఛన్‌ కోసం జీవో ఇచ్చారు. 
- దాన్ని జనవరి 2019 నాడు అంటే ఎన్నికలు మూడు నెలల ముందు అమలు చేయడం మొదలు పెట్టారు. 
- కేవలం 6600 మందికి రూ.1500 చొప్పున ఎన్నికల ముందు మూడు నెలలు ఇచ్చారు. 
- వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019–20లో ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున 31వేల మందికి ఇచ్చాం. 
- 2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి అందిస్తున్నాం. 
- మీరిచ్చిన 6 వేల పింఛన్లు ఎక్కడ..? మేమీరోజు ఇస్తున్న 56 వేల పింఛన్లు ఎక్కడ..? 
- మీరిచ్చిన రూ.1500 ఎక్కడ..? మేమిచ్చే రూ.3000 ఎక్కడ..? 
- మీరు ఆ మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే..మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు ఇస్తున్నాం. 
- చర్మకారుల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్‌ 191 ఇచ్చారు. 
- ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు మందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు. 
- వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్‌ రూ. 2వేలు చేశాం.
- 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మంది, 21–22లో 35వేల మంది, 22–23లో 40వేల మందికి, 23–24లో 41 వేల మందికి ఇస్తున్నాం. 
- వృద్ధాప్య పింఛన్‌ను ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నామో ఈ చర్మకారుల ఫించన్‌ను కూడా పెంచుతూనే ఉన్నాం. 
- ప్రస్తుతం చర్మకారులు రూ. 2750 పింఛన్‌ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3వేలు అవుతుంది. 
- ఈ పింఛన్ల కోసం 19–20లో రూ38 కోట్లు, 20–21లో రూ. 67 కోట్లు, 21–22లో రూ. 85 కోట్లు, 22–23లో రూ.119 కోట్లు ఇచ్చాం. 
- ఇప్పటి వరకూ డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్‌ కోసం ఇచ్చాం. 
- మీరిచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువగా ఇచ్చాం..మీరా మమ్మల్ని ప్రశ్నించేది..? 

వైఎస్‌ జగన్‌గారు వచ్చాకే దళితులకు రాజకీయ సాధికారత:
- మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పించే దిశగా మేం అడుగులు వేశాం. 
- దళితుల్లో మూడు ప్రధాన ఉపకులాలకు ఆర్ధికంగా వెసులుబాటు, సాధికారత కల్పించాలని ఫైనాన్స్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. 
- జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గుర్ని ఎస్పీ కమిషన్‌ మెంబర్లుగా నియమించాం. 
- నాలుగు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్‌లుగా మాదిగలకు ఇచ్చాం. 
- గుంటూరు జడ్పీ ఛైర్‌ పర్సన్‌గా క్రిస్టినాకు ఇవ్వడం జరిగింది. 
- డీసీఎంస్‌ ఛైర్‌ పర్సన్‌లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇవ్వడం జరిగింది. 
- మరో ఇద్దరు జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే. 
- హెచ్‌ఆర్‌సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించుకున్నాం. 
- మంత్రివర్గంలో నాతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ తానేటి వనితను హోం మంత్రిగా ఉన్నారు. 
- ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, బొమ్మి ఇజ్రాయేల్‌లను నియామకం చేశారు. 
- తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటి సారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్‌గారిదే.
- అవకాశం దొరికితే.. ఆ అవకాశాన్ని దళితులకు ఇవ్వాలనే తపన జగన్మోహన్‌రెడ్డి గారిది. 

ముందు మీరు క్షమాపణలు చెప్పి మాట్లాడండి:
- ఎస్సీ కార్పొరేషన్‌లో గతంలో ఉన్న పథకాలు ఇప్పుడు లేవంటున్నారు..
- వాళ్లు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్క  మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నాడు. 
- వేదిక, సమయం మీరే చెప్పమని సవాల్‌ విసురుతున్నా. 
- అసెంబ్లీ సాక్షిగా రండి వీటిపై చర్చిద్దాం..లేదంటే మీ నాయకుడిని పంపండి. 
- దళిత మహిళను బూటు కాలితో తొక్కారో ఆ అచ్చెన్నాయుడును చెప్పుతో కొట్టి మాట్లాడండి. 
- దళితులపై కామెంట్స్‌ చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రండి. 
- ఈ నాలుగేళ్లలో మేము ఏమేమి చేశామో అప్పుడు చర్చిండానికి సిద్ధం. 
- మీరు క్షమాపణలు చెప్పకుండా మాట్లాడటానికి అర్హతే లేదు. 

ప్రతి పథకంలో దామాషాకు మించి దళితులకు వాటా..:
- చంద్రబాబు ఎప్పుడైనా 45 ఏళ్లు దాటిన మహిళలకు సాయం అందించాలనే ప్రయత్నం చేశాడా..? 
- మేం వారికి ఇస్తున్న చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
- 28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.16 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేసిన నేత శ్రీ వైఎస్‌ జగన్‌.
- వీటిలో దళితుల వాటా అగ్రభాగంలో ఉంది. 
- అమ్మఒడిలో 44 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే.. 8 లక్షల మంది ఎస్సీ సామాజిక వర్గం వారే ఉన్నారు. 20 శాతం నిధులు వారికే వెళ్తున్నాయి. 
- చేయూతలో 24 శాతం, వైఎస్సార్‌ ఆసరాలో 21 శాతం దళితులకే అందుతున్నాయి. 
- పేదలకు ఇళ్ల పట్టాల కింద 30 లక్షలు అందిస్తే ఎస్సీ సామాజికవర్గానికి 6,36,732 పట్టాలు వారికి అందిస్తున్నాం. ఇది 21 శాతం.
- దళితులకు రావాల్సిన వాటాను దామాషా ప్రకారం మేం అందిస్తూనే రాజకీయంగానూ వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాం. 
- చంద్రబాబు హయాంలో దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించే పరిస్థితి లేదు. 
- జగన్‌ గారు అధికారంలో వచ్చాక దేవాలయ బోర్డుల్లో దళితులకు స్థానం కల్పించిన ఘనత జగనన్నదే. 

దళితులను అవమానించి ఇప్పుడు డప్పు కొడుతున్నారా..?:
- రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పనలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల మందిలో 28,486 మంది దళితులే ఉన్నారు. 
- వాలంటీర్‌ వ్యవస్థలో మరో 70 వేల మంది ఉన్నారు. 
- మొత్తంగా 3.83 లక్షల ఉద్యోగాలు కల్పించగా... దానిలో మూడో వంతు ఎస్సీ సామాజిక వర్గానికి అందించిన ఘనత జగన్‌ గారిదే. 
- చంద్రబాబు అధికారంలో ఉండగా నోట్లోంచి ఏనాడైనా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలనే పదాలు వచ్చిన సందర్భాలే లేవు. 
- ప్రతి వేదికపై కూడా నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ మమ్మల్ని జగన్‌ గారు అక్కున చేర్చుకున్నారు. 
- మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 
- దళితులకు రాజకీయాలెందుకు, శుభ్రంగా ఉండరంటూ మమ్మల్ని కించపరుస్తున్న వ్యక్తులా ఈ రోజు డప్పులు కొడుతున్నారు..? 
- డప్పు పట్టుకోవాలంటే దానికో అర్హత ఉండాలి..
- దండోరా వేయించే వ్యక్తులుగా మా సామాజిక వర్గాన్ని ఎన్నుకోవడానికి కారణం మా నిజాయితీ. 
- విశ్వనీయతకు, నిబద్ధతకు...ఇచ్చిన మాటకు ఎంత దూరమైన వెళ్లే నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌. 
- ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి అనుకుంటుంటే చంద్రబాబుకి మాత్రం అది నచ్చడం లేదు. 
- ఏదో ఒక విధంగా మమ్మల్ని చీల్చాలి..గ్రామాల్లో చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. 
- ఏదో ఒక విధంగా వారిని ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తున్నాడు. 
- అలాంటి వారు నేడు చేస్తున్న ప్రయత్నాలు, మాట్లాడుతున్న మాటలు మాదిగలెవరూ నమ్మరు.
- ఈ ఎల్లో తోడేళ్ల గుంపులో దయచేసి దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దు. 
- టీడీపీ చెప్పే పథకాలన్నీ మూన్నెళ్ల ముచ్చటే. ఎన్నికలు అయ్యాక వాటి గురించి మర్చిపోతారు. 
- ఇవన్నీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం చేసే జిమ్మిక్కులు చంద్రబాబుకే సాధ్యం. 
- నీకో పెద్ద దండం బాబూ..అంటూ రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారు. 
- రానున్న రోజుల్లో సరైన విధంగా బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. 

Back to Top