క‌ళింగ కోమ‌ట్ల అభ్యున్న‌తికి కృషి

రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

 శ్రీ‌కాకుళం: క‌ళింగ కోమ‌ట్ల అభ్యున్న‌తికి కృషి చేస్తాన‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. టౌన్ హాల్ లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో బరాటం సంతోష్ తో స‌హా ప‌లువురు యువ‌కులు పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..బ‌రాటం సంతోష్ లాంటి యువ‌కులు పార్టీలోకి రావ‌డం శుభ‌ప‌రిణామం..

 అదేవిధంగా క‌ళింగ కోమ‌ట్ల‌ను బీసీలో చేర్చే ప్ర‌క్రియ‌కు సంబంధించి కూడా కృషి చేశాను. కానీ కొంద‌రు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేదు. కానీ క‌ళింగ కోమ‌ట్ల‌ను బీసీల్లో చేర్చే విష‌య‌మై నేను చేయాల్సిన ప్ర‌య‌త్నం చేశాను. 
ఇందులో సందేహ‌మే లేదు. ఆ రోజు క‌మిష‌న్ రిక‌మెండ్ చేసే విధంగా నేను చొర‌వ చూపాను. ఆ త‌రువాత ఆ క‌మిష‌న్ రిక‌మెండేష‌న్-నే త‌రువాత క్యాబినేట్ ఆమోదించి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. ఇది నిజం కాదా చెప్పండి. మీ అందరి కోరిక మేర‌కు 
ఆ రోజు నేను చేయించాను. కానీ ఇటువంటి విష‌యాల‌ను మీ కుల సంఘ పెద్ద‌లు చెప్పాలి. కానీ వాళ్లు చెప్ప‌రు. భ‌యం కార‌ణంగా చెప్ప‌రు. క‌మిష‌న్ రిక‌మెండేష‌న్ లేకుండా ఓ క్యాబినెట్ ఓ క‌మ్యూనిటీని బీసీల్లో చేర్చ‌గ‌లదా ? లేదు. మీ పెద్ద‌లు వ‌చ్చి న‌న్ను అడిగితే నేను ఆ రోజు మిమ్మ‌ల్ని బీసీలో చేర్చే విష‌య‌మై కృషి చేశాను. కానీ న‌న్ను వ్య‌తిరేకించారు మీలో కొంద‌రు. న‌న్ను బ‌ల‌ప‌ర‌చ‌మ‌ని ఓటేయ్య‌మ‌ని అడ‌గ‌ను కానీ అబ‌ద్ధ‌పు ప్ర‌చారాన్ని అడ్డుకోమ‌ని చెబుతున్నాను. అబ‌ద్ధాల‌ను నిరోధించాలి.. వాస్త‌వాల‌ను తెలియ‌జెప్పాలి.. అని కోరుకుంటున్నాను. వీట‌న్నింటినీ ప్ర‌జ‌ల్లోకి తీసుకుని వెళ్లాలి. ప్ర‌తి ఒక్క‌రూ స‌మాజాభివృద్ధిలో భాగం కావాలి.. అని విన్న‌వించుకుంటున్నాను. 

ఇక ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌నుల విష‌య‌మై మాట్లాడుకుంటే ముఖ్యంగా పాఠ‌శాల‌ల ప్ర‌మాణాల ఉన్న‌తికి కృషి చేస్తూ,వాటికి ఆధునిక హంగులు అందిస్తున్నాం. ఇదంతా ఓట్లు కోస‌మే అంటారా ? ధ‌న‌వంతుల బిడ్డ‌ల‌తో సమానంగా చ‌దువుకునే విధంగా పేద‌ల‌కు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలానే బ‌డికి త‌మ పిల్ల‌ల‌ను పంపే త‌ల్లుల‌కు డ‌బ్బులు వేస్తున్నాం. ఇవ‌న్నీ యువ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాలి. తెలియ‌జెప్పాల్సిన బాధ్య‌త వారిపై ఉంది.

ఆర్థిక అస‌మాన‌త‌లు త‌గ్గించే ప‌ని ఎవరు చేయాలి. ప్ర‌భుత్వాలు చేయాలి. అది రాజ్యాంగ విధి. ఇవాళ అటువంటి రాజ్యాంగ విధుల‌ను నిర్వ‌ర్తించేందుకు ప్ర‌స్తుత రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న‌ది. దానిని త‌క్కువ‌గా చూపి సైకో అని చెప్పి ఇత‌రుల‌ను న‌మ్మించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది ప్ర‌తిప‌క్షంలో ఉన్న నాయ‌కులు. ఇది నిజ‌మా,  మ‌నం ఆలోచించాలి. మ‌నం ఆలోచించ‌డ‌మే కాదు గొంతెత్తి చెప్పాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్ర‌భుత్వం బిజినెస్ కమ్యూనిటీకి ఎంతో అనుకూలంగా ఉంది. ఏ వ్యాపార సంస్థ‌పైనా ఏ ఒక్క అధికారి పేరిట లేదా సంస్థ పేరిట లంచాలు అడిగేందుకు వీల్లేద‌ని చెబుతోంది. ఇందుకు విరుద్ధంగా కొంద‌రు అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నారు. మీరంతా చెప్పండి ఎవ్వ‌రైనా మీకు లంచాలు అడిగారా ? గ‌తంలో మాదిరిగా మీకు జీఎస్టీ అధికారులు కానీ ఇంకెవ్వ‌రు కానీ డ‌బ్బులు అడిగేందుకు వ‌స్తున్నారా ? మ‌రి  ఈ ప్ర‌భుత్వాన్ని సైకో ప్ర‌భుత్వం అంటారేంటి ? అదేవిధంగా మీ ఇంటి ప‌క్క‌నో వెనుక‌నో ఆర్థికంగా లేనటువంటి కుటుంబాలు హాయిగా ఇవాళ బ‌తుకుతున్నాయి. ఆ విధంగా బ‌తికేందుకు అవ‌స‌రం అయిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ది.. లంచాల‌కు తావు లేకుండా గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా అమ‌లు చేస్తున్న‌ది ఈ ప్ర‌భుత్వం కాదా అని మిమ్మ‌ల్ని అడుగుతున్నా ను. ప‌థ‌కాల అమ‌లు విష‌య‌మై ఎవ్వ‌రినైనా సంబంధిత అర్హులు బ‌తిమాలుకున్న సంద‌ర్భం ఏమ‌యినా ఉందా ? బ‌తిమాలుకోవ‌డం అన్న‌ది ఓ అవ‌మానం. 

తాను ఎన్నుకున్న ప్ర‌భుత్వం నుంచి రాజ్యాంగాధికారం అనుస‌రించి సంక్షేమ ప‌థ‌కాలు అందుకోవాలంటే ఆత్మ వంచ‌న చేసుకుని అడ్డుకుని ఉండాలా ? లేదు ఈ ప్ర‌భుత్వంలో ఈ త‌ర‌హా ప‌ని అవ‌స‌రం లేదు. మ‌న‌కు ఇటువంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న చేసే శ‌క్తి లేదు. మ‌న‌కు ఇటువంటి విష‌యాల‌పై మాట్లాడేందుకు త‌గినంత జ్ఞానం లేదు.అపార్థం చేసుకోకండి. ఏ త‌ర‌హా మార్పులు  
ఈ ప్ర‌భుత్వ పాల‌న కార‌ణంగా వ‌స్తున్నాయో అన్న‌వి  వివ‌రించాల్సిన బాధ్య‌త మ‌న‌పై  ఉంది. నేడున్న మార్పుల‌ను గ‌మ‌నించి మిగ‌తా స‌మాజానికి ఈ యువ‌కులే తెలియ‌జెప్పాలి. వారే నాయ‌క‌త్వం వ‌హించాలి. ఆ ప‌నే యువజ‌న నాయక‌త్వం చేయాలి. ప్ర‌భుత్వ ప్రాధాన్యాల‌ను తోటి స‌మాజానికి వివ‌రించ‌గ‌లిగే విధంగా యువ‌జ‌న నాయ‌క‌త్వం ఉండాలి. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గెలిస్తే ఎంత ఓడితే ఎంత కొంప ఏమ‌యినా మునిగిపోతుందా ? స‌మాజంలో వ‌చ్చే మార్పులు మాత్రం పాల‌కుల వ‌ల్ల వ‌స్తాయి. ప్ర‌భుత్వాల వ‌ల్ల వ‌స్తాయి. ఇన్నేళ్ల కాలంలో అవినీతిని రూపు మాపేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించాం కానీ విఫ‌లం అయ్యాం. కానీ ఇవాళ మార్పు వ‌చ్చింది క‌దా, మీరు ఎన్నుకున్న నాయ‌కుడికి,సంబంధిత ప్ర‌భుత్వానికి ఉన్న భావ జాలం కార‌ణంగానే ఈ త‌ర‌హా అనూహ్య మార్పు తీసుకు రావ‌డం సాధ్య‌మైంద‌న్న విష‌యం మీరంతా గుర్తించాలి. దీనినే మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ..గడిచిన సంవత్సర కాలం నుంచి మా కుటుంబంతోనే సంతోష్ ఉన్నారని అన్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడు దగ్గర పని చేస్తే మాకు చాలా గౌరవం పెరుగుతుందిని అందుకనే తాను వైయ‌స్ఆర్‌సీపీ లో చేరనున్నట్టు తనతో చెప్పారని తెలిపారు.

రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఆంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ  పద్మావతి, అంబటి శ్రీనివాసరావు, డాక్టర్ ధానేటీ శ్రీధర్, పట్టణ అధ్యక్షులు సాదు వైకుంఠరావు, శిమ్మ రాజశేఖర్, కోణార్క్ శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాసరావు, వి. నాగరాజు, మెంటాడ స్వరూప్, మండవిల్లి రవి,  అంధవరపు సంతోష్, ప్రసాద్, ఎన్ని ధనుంజయ్, పొన్నాడ రిషి, పాలిసెట్టి మధు తదితరులు పాల్గొన్నారు.

Back to Top