తాడేపల్లి: అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలు: శ్రీకాకుళం :సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్ విజయనగరం :బెల్లాని చంద్రశేఖర్, జోగారావు. విశాఖపట్నం :భాగ్యలక్ష్మి, కెకె రాజు. తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత పశ్చిమ గోదావరి :కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపీ) కృష్ణా :మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి గుంటూరు :విడదల రజని, డైమండ్ బాబు ప్రకాశం :టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి నెల్లూరు :రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ) చిత్తూరు :గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అనంతపురం :కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్ కడప :సురేష్‌బాబు, రమేష్‌యాదవ్ కర్నూలు :హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు).