విశ్వాసబలం సాక్షిగా....విలువైన పాలన

విశ్వమంతా ప్రాణవిభుని మందిరమే..వీధి వాకిలి ఏది చెల్లెలా?
సమస్త ప్రపంచాన్నంతా తన విశ్వాసబలం సాయంతో మనసుకు హత్తుకునే మనుషులే మహనీయులవుతారు. సామాన్యులైనా అసామాన్యలుగా ఎదుగుతారు. మానవజాతి మనుగడకే ప్రాణం పోసే విధాతలు అవుతారు. 
మానవేతిహాసంలో ఎన్నెన్నో అద్భుతాలు. ఆ అద్భుతాలను ఆవిష్కరించిన దార్శనికులు. 
ప్రపంచమానవాళి క్రీస్తును తలచుకుంటున్న సమయమిది. ప్రేమ, కరుణ, దయల మానవీయలక్షణాలతో కరుణామయుని స్తుతిస్తున్న వేళ ఇది. విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తున్న సందర్భమిది. ప్రార్ధించే పెదవులు, సాయం చేసే చేతులు ప్రపంచానికి అపురూప కానుకలను అందిస్తాయి. నిజమైన సంతోషాన్నిస్తాయి. 
ఐదుకోట్ల ఆంధ్రప్రజల గురించి  ఆలోచించే నేత ఇప్పుడున్నారు. పేదల గురించి పట్టింపు వున్న నాయకుడతను. సామాన్యజనాన్ని గుండెకత్తుకునే గుణశీలుడు. ప్రతిమనిషిలోనూ అక్కచెల్లెల్ని, అవ్వాతాతల్ని, సోదరుల్ని, స్నేహితులను చూసే ఆత్మబంధువు తత్వమతనిది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి అటు సంక్షేమ పథకాల గురించి, ఇటు అభివృద్ది ప్రణాళికల గురించి నిరంతరం ఆలోచిస్తున్న సీఎం జగన్‌..ఏడు నెలల కాలంలోనే తనేంటో చాటుకున్నాడు. తన మనిషితనాన్ని ఆవిష్కరించుకున్నాడు. జనం సాక్షిగా పాలకుడిని కాదు ...మీ సేవకుడిని అని ముందుకు నడుస్తున్నాడు. అతను యువకుడే కావచ్చు...కానీ పెద్ద మనసున్న మనిషి. జనమందరి సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడు. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలందరూ తనవాళ్లేనని తలచే ’ది లీడర్‌’. 
ముఖ్యమంత్రిగా రాష్ట్రసర్వతోముఖాభివృద్ది దిశలో వడివడిగా అడుగులేస్తున్న వైయస్‌వారసుడు రైతన్నకు భరోసానిచ్చాడు. నేతన్నకు నేనున్నానని చెప్పాడు. ఆడపడుచులకు అన్నీ తానై చూసుకుంటానన్నాడు. అవ్వాతాతలకు మనవడయ్యాడు. ఆరోగ్యశ్రీ ఆసరా అయ్యాడు. ఇంటింటి ఆత్మబంధువుగా ఆత్మీయస్పర్శనందిస్తున్నాడు. ఇంటిపెద్దకొడుకు తీరులో...ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బాధ్యతలను మోస్తున్నాడు. జలధారలను ఒడిసిపట్టి...పంటపొలాలకు అందించాలని, పరిశ్రమలతో నిరుద్యోగాన్ని తరమాలని, చదువుల వెలుగులు పంచాలని...ఎన్నెన్నో ఆలోచనలతో...దూరదృష్టితో ప్రజాపాలన చేస్తున్న  ఏపీ సీఎంవి...తడబడని అడుగులు. జంకని మాటలు. 
తండ్రి ఆశయాలు తెలుసు. ఆదర్శాలు తెలుసు. ప్రజల కోసం పడ్డ తాపత్రయం తెలుసు. తెలుగు గుండె చప్పుడుగా ధ్వనిస్తున్న తండ్రిపేరుకు ....ప్రతిధ్వనిలా వినిపిస్తున్న వైయస్‌ జగన్‌కు రాష్ట్రానికి సంబంధించిన మూడుప్రాంతాలపైనా స్పష్టమైన అవగాహన ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల పరిస్థితులను కళ్లారా చూసినవాడు. పాదయాత్ర సాక్షిగా జనజీవితాలను
దగ్గరగా చూసినవాడు. మూడు ప్రాంతాల ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన వుంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఆయా ప్రాంత ప్రజలకు సంబంధించి ఏమేమి చేయాలో...పాదయాత్ర డైరీలో స్పష్టంగా రాసుకున్న జగన్‌...ప్రభుత్వాధినేతగా..ఒక్కక్షణమైనా ఏమరుపాటు లేకుండా ఆ దిశలోనే ఆలోచిస్తున్నాడు. రాసుకున్న అక్షరాల సాక్షిగా...ప్రజలకు నవరత్నాల సంక్షేమ పథకాలను అందిస్తున్నాడు. అభివృద్ది పథకాలను ఆవిష్కరిస్తున్నాడు.
అతనిది ప్రజాసంకల్పం. ఆ సంకల్పానికి తోడు అంతులేని ఆత్మవిశ్వాసం వుంది. ప్రజల మంచిని సంకల్పించిన మనిషికి ఓటమి వుండదన్న గట్టి ’విశ్వాసబలం’ ఉంది. 
ఐదుకోట్ల ఆం్ర«ధులకు మంచిరోజులు వచ్చాయని, జనావళికి జవసత్వాలు సమకూరుతాయని నమ్మకాన్ని కలిగిస్తున్న, వైయస్‌ జగన్‌ పాలన...వైయస్‌ఆర్‌ దీవెన.
ప్రేమ, దయ, కరుణ, శాంతి, సేవాభావాల సందేశాలతో ముందుకు సాగుతున్న వైయస్‌జగన్‌ పాలనాకాలం.... ఒక కొత్తశకం. ప్రజలందరికీ మేలు చేసే నవశకం. 
 

Back to Top