సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని

స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం

వచ్చే ఎన్నికలు పార్టీలు, వ్యక్తులు మధ్య కాదు. క్లాస్ వార్

జనం..  వైయ‌స్ జగన్ ఒకటైపోయారు

శ్రీ‌కాకుళం:  ముఖ్య‌మంత్రి ఎక్క‌డి నుంచి ప‌రిపాల‌న చేస్తే అదే రాజ‌ధాని అవుతుంద‌ని స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించబడుతుతుందని మంచి ప్రకటన చేశార‌ని, ఈ నిర్ణ‌యంతో. రాష్ట్ర ప్రజలంతా సంతోషాన్ని తెలియపరుస్తున్నార‌ని చెప్పారు. వైయ‌స్ జగన్ నిర్ణయం అద్బుతం.. ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఏదని గూగుల్ లో సెర్చ్ చేసిన విశాఖ నే చూపిస్తుందన్నారు. అన్ని రకాలుగా కనెక్టివిటీ హబ్ గా విశాఖ ఉంది. పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖపై ఆసక్తి చూపుతున్నారు. స్వయంగా వైయ‌స్ జగన్ నే విశాఖలో ఉంటానని పారిశ్రామిక వేత్తలకు చెప్పారు. విశాల తీర ప్రాంతం… ఇండస్ట్రియల్ కారిడార్ గా మారబోతుంది. పోర్ట్స్, హార్బర్, జట్టీలు యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతున్నామ‌ని తెలిపారు. 

 
 అది శతాబ్దపు జోక్
లోకేష్ పాదయాత్ర ను డైవర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆయనేమైనా జాతీయ నాయకుడా పాదయాత్ర చేసుకో. బహుముఖ ప్రజ్ఞాశాలి పాదయాత్ర డైవర్ట్ చేయడం.. శతాబ్దపు జోక్ అని తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. ఎన్నికలకు సిద్దమౌతున్నాం. వచ్చే ఎన్నికలు పార్టీలు, వ్యక్తులు మధ్య కాదు. క్లాస్ వార్… జరగబోతోంద‌న్నారు. పెత్తందారులకు – పేదలకు మధ్య‌ పోరు జ‌రుగుతుంద‌ని, ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఏ వ‌ర్గానికి అన్యాయం జరగకుండా వైయ‌స్ జగన్ జాగ్రత్తగా పాలన చేస్తున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని అమరావతిలో పేదలకు ఇళ్ళస్థలం ఇవ్వద్దని చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని చెప్పారు. చంద్రబాబు నువ్వు క్రిమినల్ వి ముఖ్యమంత్రిగా పనిచేయడం నేరం పాపం. అణగారిన వర్గాల కోసం ఒకే ఒక్కడు వైయ‌స్‌ జగన్ పోరాడుతున్నారు. జనం  వైయ‌స్ జగన్ ఒకటైపోయారు.

పేదల కోసం పోరాడే.. కమ్యునిస్ట్ లు సైతం.. అమరావతి లో పేదలకు పట్టాలు పంపిణి ని అడ్డుకోవడం దారుణం. ఇది ఎంతదారుణం.. తప్పు కదా. వైయ‌స్ జగన్ లాంటి గొప్ప నాయకుడు మహా నాయకుడు లేడు, రాడు . చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశార‌ని విమ‌ర్శించారు.  విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర వలసలు ఆగుతాయని త‌మ్మినేని సీతారాం తెలిపారు.

Back to Top