అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు మరి కాసేపట్లో కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే ప్రచార సభలో వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఇప్పటికే ఆదోని పట్టణం ప్రజలతో కిక్కిరిసిపోతోంది. అలాగే 11.30 గంటలకు తాడిపత్రి (అనంతపురం), మధ్యాహ్నం రెండు గంటలకు మదనపల్లి(చిత్తూరు)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.