నేడు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు

వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు

తాడేపల్లి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యల వల్ల కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ స్పష్టంగా తేల్చినప్పటికీ, ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తిరుమల పవిత్రతను కాపాడుతూ, చేసిన మహాపచారానికి ప్రతీకారంగా కాకుండా ప్రక్షాళనగా స్పందించాలనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

సీబీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా నిజాలను అంగీకరించకుండా, ఫ్లెక్సీలు, దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మరో కుట్రగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్ర పవిత్రతకు కళంకం తెచ్చేలా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

చంద్రబాబు బ్యాచ్ చేసిన మహాపచారానికి రాజకీయంగా కాకుండా ఆధ్యాత్మికంగా ప్రతిస్పందించడమే ఈ పాప ప్రక్షాళన పూజల లక్ష్యమని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. భక్తుల విశ్వాసాలను కాపాడటమే పార్టీ యొక్క కర్తవ్యమని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్ర గౌరవాన్ని పరిరక్షించడంలో వెనుకాడబోమని పార్టీ నేతలు తెలిపారు.

Back to Top