ఆర్‌బీకే నుంచే వేరుశ‌న‌గ విత్త‌నాల పంపిణీ

విత్త‌న వేరుశ‌న‌గ‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌

అనంత‌పురం: రైతులకు రైతు భరోసా కేంద్రం నుంచే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ తెలిపారు. బుధ‌వారం అనంత‌పురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో ఖరీఫ్ కు సంబంధించి రైతుల‌కు స‌బ్సిడీలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు విత్తన వేరుశనగను ఎమ్మెల్యే చేతుల మీదుగా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రైతు కూలీతో పాటు రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని తెలిపారు. రైతుల కష్టాలు బాగా తెలిసిన మీ బిడ్డ సీఎంగా ఉన్నాడని తెలిపారు. అందుకే రైతులు నష్టపోకూడదని ప్రతి అడుగులో వారికి అండగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా అన్ని విషయాల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రైతన్నల మీద ప్రభుత్వానికి ఉన్న  బాధ్యత, మమకారం, ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గత 23 నెలల్లోనే రైతుల కోసం ఏకంగా రూ. 83 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ నెలలోనే రైతులకు రూ.5,784 కోట్లు ఇచ్చామని తెలిపారు.  ఎక్కడా వివక్ష చూపకుండా, పూర్తి పారదర్శకంగా, లంచాలకు తావు లేకుండా, ఏ ఒక్కరికి నష్టం కలగకుండా నేరుగా రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా, సున్నా వ‌డ్డీ, పంటల బీమా ప‌రిహారాన్ని జ‌మ‌ చేస్తున్నామని చెప్పారు.  గతంలో ఎన్నడూ లేని రీతిలో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ పంటల ఆయకట్టుకు నీటిని విడుదల చేశార‌ని చెప్పారు.  అదే తరహాలో ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, రైతులు రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా అన్ని ర‌కాల సేవ‌లు పొందాల‌ని ఎమ్మెల్యే ఉషాశ్రీ చ‌ర‌ణ్ సూచించారు. 

Back to Top