సామాజిక న్యాయ సంస్కర్త జగనన్న

బలహీన వర్గాల గౌరవం పెంచిన సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్ రాజు

వెనుకబడిన వారికి ఉన్నత పదవులిచ్చిన జగనన్న: ఎంపీ వంగా గీత

50 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు జగనన్న వరం: ఎంపీ నందిగం సురేష్

నాయకులు, అధికారులే ఇంటికొచ్చి పథకాలిచ్చేలా జగనన్న పాలన: ఎమ్మెల్యే అదీప్ రాజ్ 

 పెద్దాపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర 

పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీధులన్నీ జై జగన్ నినాదాలతో మార్మోగాయి. జగనన్న సహకారంతో తాము సాధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారతను నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, కురసాల కన్నబాబు, నియోజకవర్గ సమన్వయకర్త దవులూరి దొరబాబు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే..

మండలి చైర్న్ మోషేన్ రాజు
* అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతోంది. ఇదే సామాజిక న్యాయం.
* అంబేద్కర్ ఆశించినట్లు దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి వచ్చేందుకు జగనన్న చర్యలు తీసుకుంటున్నారు.
* రాజకీయంగా నేను శాసనమండలి చైర్మన్‌గా ఉన్నానంటే సీఎం జగన్ సామాజిక సాధికారత చర్యల్లో భాగమే.
* బీసీవర్గానికి  చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా, నందిగం సురేష్ ఎంపీగా అయ్యారంటే కారణం సీఎం జగన్.
* జగనన్న పాలనలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. 
* సంక్షేమ పథకాలు ఎలాంటి లంచాలు లేకుండా, రికమెండేషన్లు లేకుండా అందుతున్నాయి.
* మహిళా సాధికారత సాకారమైంది. 
* వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే, సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. 
* పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లీషు మీడియం చదువు, బ్యాగులు, షూ, కార్పొరేట్ చదువు దక్కుతోంది. 
* 56 కార్పొరేషన్లు ఇవ్వడం ద్వారా బడుగు బలహీనవర్గాలు, దళితులను గౌరవం పెంచిన చరిత్ర సీఎం జగన్‌ది.
*అంబేద్కర్ కోరుకున్నట్టుగా సాధికారత సాధించిన సీఎం జగన్ 

ఎంపీ వంగా గీత
* జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ బాగుండాలని కష్టపడుతున్నారు. 
* ప్రజల్ని పూర్తిగా ఓటర్లుగానే చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు మార్పు వచ్చింది. 
* ప్రజల ఆరోగ్యం, చదువు, రైతన్నలకు నీరు అందాలని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టిన వ్యక్తి వైయస్సార్.
* ఆయన తర్వాత జగనన్న సీఎంగా వచ్చి పది అడుగులు ముందుకు వేశారు. పేదవాడిని గౌరవించారు. 
* ప్రజలు చేయి చాచి అడగాల్సిన పని లేకుండా, ఆఫీసులు, నాయకుల చుట్టూ తిరగకుండా, హక్కుగా భావించి పథకాలు అందిస్తున్నారు. ఇది జగనన్న చేసి చూపించారు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రాజకీయంగా పదవులిచ్చారు. 
* వెనుకబడిన జాతులకు పదవులు, పరిపాలించేలా 50 శాతంపైగా అవకాశాలు ఇచ్చిన జగనన్న. 
* 2019 కి ముందు ఎన్ని పథకాలున్నాయి? ఇప్పుడెన్ని పథకాలు అనేది ప్రజలు బేరీజు వేసుకోవాలి. 
* ప్రజా ప్రభుత్వం, ప్రజల్ని గౌరవించే ప్రభుత్వం జగనన్నది. 

ఎంపీ నందిగం సురేష్
* చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఎక్కడా ఫెయిర్‌గా ఉన్న దాఖలాలు లేవు.
* జగనన్న పేద పిల్లల్ని చదివించాడు. రైతుల్ని, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతల్ని ఆదుకున్నాడు. ఇళ్లు కట్టించాడు. అసైన్డ్ భూములపై ఇబ్బందులను తొలగించాడు. 
* రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే జగనన్న గొప్పతనమే. 
* ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చారు. 
* అధికారం కోసం ఎన్ని రకాలుగానైనా ఎస్సీలను, బీసీలను అందరినీ చంద్రబాబు వాడుకుంటాడు. 
* ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటాడా అంటాడు. బీసీల తోకలు కత్తిరిస్తానంటాడు. 
* ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ చంద్రబాబుకు మనం నచ్చం. 
* దళితులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అవమానపర్చి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. 
* పవన్ లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. 
* జగనన్నను చేజార్చుకుంటే మన భవిష్యత్ 20-25 సంవత్సరాలు వెనక్కి పోతుంది. 
* జగనన్నను కాపాడుకుంటే మన భావితరాలు బాగుంటాయి. 
* తెలంగాణలో ఆరోగ్యశ్రీని రేవంత్ రెడ్డి రూ.10 లక్షలు చేస్తే ఆహా ఓహో అంటున్న ఎల్లో మీడియా... జగనన్న ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచితే నోరెత్తలేదు. 
* 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కుప్పానికి నీళ్లు ఇవ్వని బాబు.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. 
* హైదరాబాద్ వెళ్లి పడుకుంటున్న చంద్రబాబు. కానీ జగనన్న ఇక్కడే ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 
* ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని చూస్తుంటే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. 
* అద్భుతమైన రాజధాని కడతానని 53 వేల ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు.
* అమరావతి రైతులు ఇబ్బంది పడటానికి కారణం చంద్రబాబే. 
* వ్యవసాయ కూలీ కొడుకునైన నన్ను ఎంపీగా చేసిన ఘనత జగనన్నది. 
* జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. 
* జన్మభూమి కమిటీల ద్వారా డబ్బు దోచుకున్న చంద్రబాబు. 
* తెలంగాణలో 7 చోట్ల పవన్ కల్యాణ్ పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. 
* వీళ్లంతా 151 సీట్లు, 30 మంది ఎంపీల బలం ఉన్న జగనన్నను ఎలా ఓడిస్తారు. 

ఎమ్మెల్యే అదీప్ రాజ్
* 2019 ఎన్నికల ముందు మీ అందరి దగ్గరికీ వచ్చాం. హామీలిచ్చాం. 
* జగనన్నను గెలిపిస్తే అమ్మ ఒడి ద్వారా స్కూలుకు పంపితే 15 వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం. అమ్మ ఒడి హామీ నిలబెట్టుకున్నాం. 
* జగనన్నను గెలిపిస్తే రైతు భరోసా కింద డబ్బులు వేస్తామని హామీ ఇచ్చాం. నిలబెట్టుకున్నాం. 
* డ్వాక్రా రుణాలు నాలుగు దఫాలుగా తిరిగిస్తామని చెప్పాం. మూడు విడతలూ వచ్చాయి. ఇదే జగనన్న నైజం.
* చంద్రబాబు మీటింగ్ పెట్టి మహిళలతో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. అందరూ చంద్రబాబుకు ఓటేశారు. ఏమైంది? రుణమాఫీ చేయలేదు. 
* చేయూత ద్వారా ఏటా రూ.18,750, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేలు, ఆటో సోదరులకు రూ.10 వేలు, రజకులకు రూ.10 వేలు, మత్స్యకార భరోసా రూ.10 వేలు, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా.. ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్న జగనన్న. 
* అందుకే ఈరోజు ధైర్యంగా ప్రతి గడపకూ వచ్చి మీకు లబ్ధి జరిగిన విషయాన్ని చెబుతున్నాం. 
* 2019 మేనిఫెస్టోని పట్టుకొని హామీలన్నీ నెరవేర్చాం అని ధైర్యంగా చెబుతాం. కానీ 2014 టీడీపీ మేనిఫెస్టో పట్టుకొని వాళ్లు చెప్పగలరా? 
* వైయస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్, డ్వాక్రా రుణాలకు పావలా వడ్డీ గుర్తుకొస్తాయి. 
* చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. చెప్పుకోడానికి ఏదైనా ఒక్క పథకమైనా ఉందా? 
* జగనన్న పేరు చెబితే రెండు రోజులు మాట్లాడుకొనేలా పథకాలు గుర్తుకొస్తాయి.
* పథకాలు అందుకొనేందుకు నాయకులు, అధికారుల చుట్టూ ఎవరూ తిరగడంలేదు. వాలంటీర్ల ద్వారా పథకాలు నేరుగా అందుతున్నాయి. 
* ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకొనే అవకాశం కల్పించిన గొప్ప సీఎం జగనన్న. 
* మనకు కష్టకాలంలో అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, జగనన్నను గెలిపిద్దాం.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబు*

* ఎస్సీలు, ఎస్టీలకు మంత్రి పదవులు చంద్రబాబు ఇవ్వలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు.

* జగనన్న.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ వీరిని పదవుల్లో కూర్చోబెట్టారు. 

* సామాజిక సాధికారతకు నిజమైన అర్థం చెప్పిన జగనన్న.

* భవిష్యత్ తరాలు బాగుండాలని, విద్య, వైద్యంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 

* ప్రయివేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెట్టాలని ప్రయత్నిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లారు. 

* ఎక్కడపడితే అక్కడ లిక్కర్ దొరికేలా చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. 

* కానీ జగనన్న అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి మందులు ఉచితంగా ఇచ్చి, డాక్టర్‌ను మీ ఇంటికి పంపిస్తానంటున్నారు. తేడా గమనించాలి.

* వచ్చే ఎన్నికలు పచ్చి అబద్ధాలకోరుకు, మాట మీద నిలబడే నాయకుడికి మధ్య జరగబోతున్నాయి.

* జగనన్నకు మనందరం మద్దతిచ్చి కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది.

Back to Top