పదేళ్లలో చేయాల్సినదాన్ని మూడేళ్లలోనే చేశాం

పరిపాలనలో నిమగ్నమవడం వల్ల పార్టీ బాధ్యతలు నేతలకు పంపిణీ చేసిన సీఎం వైయ‌స్‌ జగన్‌

పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలపై ఉంది

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. పరిపాలన సంస్కరణలు, వికేంద్రీకరణ ద్వారా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలకు పదేళ్లలో చేయాల్సినదాని కంటే మూడేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా అధిక ప్రయోజనం చేకూర్చారని తెలిపారు. పదేళ్ల తర్వాత తమ కాళ్లపై తామునిలబడి.. పేదరికాన్ని అధిగమించేలా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల నియామక వివరాలు వెల్లడిస్తూ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపక్షంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎలా వ్యవహరించిందో అధికారంలో ఉన్నప్పుడూ అదేరీతిలో వ్యవహరిస్తోంది.
► అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో అమలు చేయాల్సిన హామీలను మూడేళ్లలోనే సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేశారు. ఇటీవల మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. 
► ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను ప్రత్యక్షంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ చూసుకునేవారు. ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల అటు పరిపాలన, ఇటు పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు పార్టీ బాధ్యతలను జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు పంపిణీ చేశారు. 
► 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా పరిగణంచి పార్టీ అధ్యక్షులను నియమించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. 
► జూలై 8న పార్టీ ప్లీనరీ జరగనుంది. ఆలోగా బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మించే గురుతర బాధ్యతను జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు అప్పగించారు. 
► ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు గడపగడపకు వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ప్రతిపక్షాల దుష్ప్రచారాలను ఆధారాలతో సహా ఎండగట్టి.. తమను ఆశీర్వదించాలని ప్రజలను కోరతారు.
► చేసిన మంచి, పనితీరు, పరిపాలనను చూసి ప్రజలు బహుమానంగా 2024 ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ కోరుకుంటారు. ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు గడపగడపకు వెళ్లి ప్రజలను అదేరీతిలో ఆశీర్వదించమని కోరతారు.  

Back to Top