గుంటూరులో గాంధీ పార్క్‌ను ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి

గుంటూరు: గుంటూరు నగరంలో రీ మోడల్‌ చేసిన గాంధీ పార్క్‌ను వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ గాంధీ పార్క్‌ను రూ.6.5 కోట్లతో రీ మోడల్‌ చేసింది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నగర ప్రజలకు గాంధీ పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. కుటుంబాలుగా పార్క్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నగర జీవితంలో ఒత్తిడికి గురవుతుంటారని, అలాంటి వారికి రిలీఫ్‌ ఇచ్చేలా పార్క్‌ను తీర్చిదిద్దారని చెప్పారు. అన్ని నగరాల్లో కూడా వాకింగ్‌ ఏరియాలు, పార్కులు ఏర్పాటు చేసి ఎక్కువ ఆక్సిజన్‌ లభించే ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరి, మేయర్‌ మనోహర్, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
 

Back to Top