వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పార్టీ శ్రేణుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు

అనుకూల మీడియాతో కలిసి ప్రభుత్వంపై టీడీపీ దుర్మార్గ ప్రచారం 

శక్తివంతమైన నేతగా సీఎం వైయ‌స్‌ జగన్‌ 

బాబు 14 ఏళ్లలో చేయలేనిది వైయ‌స్ జగన్‌ రెండున్నరేళ్లలో చేసి చూపించారు 

మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం

తాడేప‌ల్లి: నేరం చేసిన వాళ్లే.. దొంగా..దొంగా అంటూ అరిచిన చందంగా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మహిళల కోసం నారీ సంకల్ప దీక్ష అంటూ మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం  వైయ‌స్ జగన్‌పై విమర్శలకు తెగబడుతోందని మండిపడ్డారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు,శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు,జిల్లాపరిషత్ ఛైర్మన్లు,నగరమేయర్లు,డిప్యూటి మేయర్లు,పార్లమెంట్,అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్ ఛార్జ్ లు,నామినేటెడ్ ఛైర్మన్లు,మహిళా డైరక్టర్లు,స్దానిక సంస్ధలలో మహిళా ప్రతినిధులు,పార్టీకి సంబంధించి మహిళా ప్రతినిధులతో సోమవారం  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు,కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి సంధాన కర్తగా వ్యవహరించారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే...

 రాష్ర్టంలో అనేక రంగాలలో సంస్కరణలు ప్రవేశపెడుతూ అటు సంక్షేమపరంగా ఇటు అభివృధ్ది పరంగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ర్టంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్  శక్తివంతంగా మారుతుండటంతో  ప్రభుత్వంపైన,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా తెలుగుదేశం పార్టీ తనకు ఉన్న దుష్టమీడియా బలంతో దుర్మార్గమైన కుట్ర,కుతంత్రాలతో అధికారమే పరమావధిగా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమం ఓ చరిత్ర, విప్లవాత్మక చర్య అని అన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేయలేనిది శ్రీ వైయస్ జగన్ ముఖమంత్రిగా రెండున్నరేళ్ల పాలనలో చేసి చూపారని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా  అట్టడుగువర్గాలను పైకి తీసుకువచ్చేలా శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా గ్లోబల్ స్టాండడ్స్  ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ర్టంలో మహిళాభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. భథ్రతపరంగా రక్షణపరంగా,చట్టసవరణలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. శ్రీ వైయస్ జగన్ చేపట్టిన చర్యల ఫలితాలు కూడా కొన్నింటిలో వెంటనే కనిపిస్తున్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చేందుకు మహిళలు ముందుకు వస్తున్నారనేందుకు అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. ఎఫ్ ఐ ఆర్ నమోదు కూడా చాలా త్వరితంగా జరుగుతోంది. అంటే  సిస్టమ్  రెస్పాన్సివ్ గా తయారవుతోంది. రాజకీయంగా,ఇటు సామాజికంగా మహిళలు ఎదిగేలా శ్రీ వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. స్దానిక సంస్దలలోగాని నామినేటెడ్ పదవుల ఎంపిక సమయంలోగాని తాను మహిళా పక్షపాతిననే స్దాయిలో వారికి ప్రాధాన్యత కల్పించారు. రాష్ర్టంలో మహిళలకు నామినేటెడ్ పదవులలో,పనులలో 50 శాతం మహిళలకు తప్పనిసరి చేస్తూ చర్యలు తీసుకున్నారు. వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ బిల్లు కూడా వైయస్ జగన్ తీసుకువచ్చారు. ఇళ్ల స్ధలాలను సైతం మహిళల పేరుపైనే కేటాయించారు. అమ్మఒడి పేరుతో వారి పిల్లల చదువులకు ప్రోత్సాహాకాన్ని సైతం వారి బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తూ వారికి ఆత్మగౌరవాన్ని కల్పిస్తున్నారు.

మహిళలకు ఆసరా,ఇబిసి నేస్తం వంటి పధకాలను అమలు చేస్తున్నారు. ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా ఈ విషయంలో గర్వపడేవిధంగా శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారు. శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి ప్రశ్నించే అర్హత తెలుగుదేశం పార్టీకి గాని,చంద్రబాబుకు గాని లేదని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ర్టాన్ని సర్వనాశనం చేసి,రాష్ర్టాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పనిచేసినా కూడా శ్రీ వైయస్ జగన్ అమలు చేస్తున్న పధకాలు ఉదాహరణకు అమ్మఒడి లాంటి పధకం ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు.

ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ గమనించాల్సి అంశం ఏమంటే నిన్న విజయవాడలో తెలుగుదేశం పార్టీకి  కార్పోరేటర్ అభ్యర్ది గా పోటీ చేసిన ఓ దుర్మార్గుడైన వినోద్ జైన్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడి 14 ఏళ్ల బాలిక జీవితాన్ని బలితీసుకున్నాడు. నిజానికి ఆ బాలిక కుటుంబం విద్యాధిక కుటుంబం. విజయవాడ లాంటి నగరంలో నివసిస్తున్నా కూడా అత్యంత బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి తెలుగుదేశం పార్టీ నేత వినోద్ జైన్ ప్రధాన కారణం. ఇది బహిరంగంగా అందరికి తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ ఎంతగా బరితెగించిందంటే మహిళలకోసం నారీ సంకల్పదీక్షలు అంటూ దీక్షలు చేసి మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలకు తెగబడింది. అంటే నేరం చేసిన దొంగే దొంగా...దొంగా అని అరిచిగోల చేసిన చందాన దిగజారుడు రాజకీయాలు చేస్తోంది.

అంతిమంగా తెలుగుదేశం పార్టీకి కావాల్సింది ఒక్కటే తమ పార్టీ నేత బాలికపై లైంగికదాడికి పాల్పడి ఆత్మహత్యకు కారకులైనప్పటికి ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రతి సంఘటనను భూతధ్దంలో చూపాలి. దాంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేనప్పటికి ప్రభుత్వం వైఫల్యం చెందిందనే భావన ప్రజలలో కలిగించాలనేదిశగా నారీసంకల్పదీక్షలంటూ కార్యక్రమాలను చేపట్టింది. అందుకు ఉన్నవి లేనివి కల్పించి ప్రత్యేక కధనాలు ఇచ్చి డిబేట్లు నిర్వహించే ఛానల్స్ మధ్దతుగా ఉన్నాయి. మహిళలపై నేరాల విషయంలో శ్రీ వైయస్ జగన్ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారనేది అందరికి తెలుసు. దిశ యాప్ ను కోటి ఆరులక్షలమందికి పైగా మహిళలు,యువతులు,విద్యార్ధునులు డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఈ ప్రభుత్వంపై మహిళల్లో ఉన్న నమ్మకమే కారణం. ఇలాంటి విషయాలను తెలుగుదేశం అనుకూలమీడియా కావాలనే విస్మరిస్తుంది.

ప్రభుత్వంపై ఎంతగా బురదచల్లాలో అంతగా విపరీతధోరణులు ప్రదర్శిస్తుంది. దీనిని సరైన రీతిలో ఎదుర్కోవాల్సిఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి. మనం ఢీ కొంటుంది మాయాయుధ్దం చేయడంలో అత్యంత ఎక్స్ పర్ట్, దుర్మార్గమైన  తెలుగుదేశం పార్టీతో అనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. ఎందుకంటే అభివృద్ది పరంగా,సంక్షేమం పరంగా విద్య,వైద్యం,పేదరిక నిర్మూలన,మహిళాసాధికారిత,రైతు సాధికారిత,వృధ్దుల సంక్షేమం వంటి అంశాలలో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే శరవేగంగా ముందుకు వెళ్తున్న శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వాన్నిఎలాగైనా దెబ్బతీయాలనే దిశగా టిడిపి పనిచేస్తుంది.

 చిన్నచిన్న అంశాలను సైతం భూతద్దంలో చూపుతూ నిత్యం తూలనాడుతూ,రెచ్చగొట్టే వ్యాఖ్యలతో,వార్తలతో,డిబేట్లతో అనుకూలమీడియా సహకారంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి,దాని అనుకూల సోషల్ మీడియా,పచ్చటివి ఛానల్స్,పత్రికలు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు  గ్రహించారు కాబట్టే ఇటీవల జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికలలో సైతం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి మధ్దతుగా నిలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ తెలుగుదేశం,దాని అనుకూల మీడియా కుట్రలను,కుయుక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 

Back to Top