ఈ క్రెడిట్ అంతా సీఎం వైయ‌స్ జగన్‌ను ఆశీర్వదించిన ప్రజల‌దే 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

మున్సిపల్‌ ఫలితాలు సీఎం వైయ‌స్‌ జగన్ ‌పాలనకు నిదర్శనం

దింపుడు క‌ల్లం ఆశతో టీడీపీ విపరీతంగా డబ్బు కూడా పంచింది

 తాడేపల్లి: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాలనకు నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైయ‌స్ఆర్‌‌సీపీ అని పేర్కొన్నారు. పార్టీకి, సీఎం వైయ‌స్ జగన్ తేడా ఏమీ లేదని, ఈ క్రెడిట్ అంతా సీఎం వైయ‌స్ జగన్‌ను ఆశీర్వదించిన ప్రజ‌ల‌ద‌ని చెప్పారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ బయటకి వచ్చి ఒక్క ఓటు అడగలేదని, ఈ 20 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. అక్క చెల్లెల్లు, అన్నతమ్ములు, అవ్వతాతలు తన వైపు ఉన్నారని సీఎం వైయ‌స్ జగన్‌కి భరోసా ఉందని చెప్పారు. వారి కుటుంబంలో ఒకడిగా సీఎంను గుర్తించారని తెలిపారు.

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయిని చెప్పారు. ఒక నాయకుడిపై ఇంత భరోసా చూపడం దేశంలోని ఇది తొలిసారి అని చెప్పారు. చంద్రబాబు ప్రచారం చేయలేదు, ప్రజల్ని బూతులు తిట్టారని మండిపడ్డారు. ఇప్పుడు వెళ్లి హైదరాబాదులో కూర్చున్నారుని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబును ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఆయనకీ తెలుసన్నారు. దింపుడు గల్లం ఆశతో విపరీతంగా డబ్బు కూడా పంచారని మండ్డారు. తాము ప్రతిపక్షం ఉండాలి అని కోరుకుంటున్నామని తెలిపారు. కానీ, చంద్రబాబు దానికి కూడా అర్హుడను కాదు అని నిరూపించుకున్నారని తెలిపారు. ఇక వెంటిలేటర్ మీద నుంచి కూడా టీడీపీ కిందకు పడిపోయినట్లే అని సజ్జల పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top