స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అతిపెద్ద స్కామ్‌

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

 తాడేప‌ల్లి:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అతిపెద్ద స్కామ్‌ అని, ఈ స్కామ్‌లో రాజకీయ ప్రమేయం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 ‘కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దు. సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు. కోర్టులో కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణం. స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉంది. చంద్రబాబుకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్‌ జరుగుతుందా?’ అని  సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top