వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ జనసంద్రమైంది. జై జగన్ నినాదాలతో హోరెత్తింది. సామాజిక సాధికార బస్సు యాత్ర పల్నాడు జిల్లా వినుకొండలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, జంగా కృష్ణమూర్తి, కుంభా రవిబాబు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారని, బడుగు వర్గాలను తలెత్తుకొని జీవించేలా చేశారని నేతలు కొనియాడారు. నేతలు ఏమన్నారంటే.. మంత్రి మేరుగ నాగార్జున..... – ఇప్పుడు ఎన్నికలు లేవు. జగనన్న ఇక్కడికి రాలేదు. ఆయన బొమ్మ పెట్టుకొని సామాజిక సాధికార యాత్ర చేస్తున్నాం. – దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలి, దేశం బాగుపడాలి, పేదవారు బాగుండాలని కోరుకున్నారు. – ఏ ముఖ్యమంత్రీ ఆ ఆలోచన చేయలేదు. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నారు. – చంద్రబాబు పాలనలో అవమానాలు ఎదుర్కొన్నాం. – జగనన్న అలా చూడలేదు. రూ.2.40 లక్షల కోట్లు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ఇచ్చారు. – పేదవాడి పిల్లలకు ఇంగ్లీషు విద్య అందిస్తున్నారు. పేదవాడు ధైర్యంగా బతికేలా చేశారు. – రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తెచ్చారంటే జీవన విధానం పెరిగిందా? తగ్గిందా? – అంబేద్కర్ విగ్రహాన్ని బాబు అవమానిస్తే, విజయవాడ నడిబొడ్డున జగనన్న వందల కోట్ల రూపాయలతో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేడ్కర్ అంటే తనకు ఎంత గౌరవమో చేతలలో చూపిస్తున్నాడు. – మరో అంబేద్కర్, మరో పూలే, మరో జగ్జీవన్ రామ్ జగనన్న. ఆదిమూలపు సురేష్, మంత్రి – సామాజిక సాధికారత ఈరోజు స్టేజీ మీద చూస్తున్నాం. – బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా మంత్రులుగా చేసిన ఘనత జగనన్నది. – ఈ గడ్డపై పుట్టిన గుర్రం జాషువాను చంద్రబాబు గుర్తించలేదు. సెప్టెంబర్ 28న జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులిచ్చిన జగనన్న. – చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు ఆ గట్టుమీద ఉన్నాయి. మోసపూరిత మాటలతో కోర్టులను కూడా పక్కదోవ పట్టించాడు. – ఈ గట్టున నా ఎస్సీలు, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీలు అనే జగనన్న ఉన్నారు. ఏ గట్టుకు వెళ్తారో ప్రజలు నిర్ణయించుకోవాలి. – ఈరోజు మంత్రులుగా మేం ఇక్కడ ఉన్నామంటే జగనన్న ఇచ్చిన సాధికారతే. విడదల రజని, మంత్రి. – జగనన్న కటౌట్‌తో బస్సు యాత్ర చేస్తుంటే ఈరోజు ఇంత మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పెద్ద ఎత్తున వచ్చారు. – వేదికపై జగనన్న లేరు. మీ గుండెల్లో ఉన్నారు. జగనన్న వస్తే వినుకొండ జన సునామీగా మారుతుందేమో! – 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే. – దేశ చరిత్రలో జగనన్న తెచ్చిన సాధికారత ఏ రాజకీయ పార్టీ, నాయకుడు, ఏ ముఖ్యమంత్రీ చేయలేదు. – వార్డు మెంబర్‌నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జగనన్న అవకాశం ఇచ్చారు. – సంక్షేమం, అభివృద్ధి దిశగా నడిపేందుకు రూ.2.40 లక్షల కోట్ల డీబీటీ ఇచ్చారు. – మా అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి ఎవరిస్తున్నారు? చేయూత ఎవరిస్తున్నారు? ఆసరా ఎవరిస్తున్నారు? మన పేర్ల మీద పుట్టింటి ఆస్తిలా 30 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఎవరిచ్చారు? – బీసీల్లో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి ఎన్నడూ లేని విధంగా గొప్ప అవకాశాలు కల్పించిన జగనన్న. – బీసీ మంత్రిగా మహిళకు అవకాశం ఇచ్చిన ఘనత జగనన్నది. – చంద్రబాబు పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను అవమానించారు. – రానున్న ఎన్నికల్లో వీళ్లంతా చంద్రబాబు తోక కత్తిరించబోతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ. – వినుకొండకు జగనన్న ఇచ్చిన హామీ వరికపూడిశెల. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. బొల్లాపల్లిలో తాగు, సాగునీరిస్తామని మాట ఇచ్చారు. – కేంద్రం నుంచి అటవీ సంబంధ అనుమతులు సాధించాం. – అన్ని అనుమతులతో వరికపూడిశెల ప్రాజెక్టును నవంబర్ 17న సీఎం జగనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు, పనులు ప్రారంభిస్తాం. – వినుకొండకు 100 పడకల ఆస్పత్రి తెచ్చుకున్నాం. – ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు, రైల్వే అండర్ బ్రిడ్జి, నరసరావుపేట–గుంటూరు హైవేను శాంక్షన్ చేయించుకున్నాం. – పొలాలకు వెళ్లే దారులు 100 కిలోమీటర్లు వేయించుకున్నాం. – ఇదివరకు ఇవన్నీ చేయలేదు. వినుకొండ అభివృద్ధి గురించి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుందాం. టీడీపీకి దమ్ముంటే రమ్మనండి. బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్యే. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కుటుంబ సభ్యులుగా భావించి దగ్గరకు తీసుకున్న జగనన్న. – ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి ఆదుకున్న రాజశేఖరరెడ్డి. – ఎందరో ఇంజనీర్లు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారంటే అందుకు కారణం వైయస్సార్. – మన నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించిన జగనన్న. – ఘాట్ రోడ్డు నిర్మాణం, రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేస్తున్నారు. – వినుకొండకు రూ.100 కోట్లతో పెద్దాసుపత్రి ఇచ్చారు. – చంద్రబాబు మారుతీకారు, బెంజ్ కారు ఇస్తానన్నాడు. – 2014–19 మధ్య ఎందుకు ఇవ్వలేదు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే – ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలను ఉపముఖ్యమంత్రులను చేసిన జగనన్న. – జగనన్న అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని సగర్వంగా తలెత్తుకొనేలా చేశారు. అలీ, నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ముందు వరుసలో నిలబెట్టిన జగనన్న. – నువ్వు నాతో ఉండాలని జగనన్న అన్నారు. మీకోసం ఎంతదూరమైనా వెళ్తా అన్నాను. మైనార్టీలు త్వరలోనే శుభవార్త వార్త వింటారు