కోట్లమంది జనం గుండె గొంతుకైనవ్యక్తి జగనన్న

బడుగు,బలహీనవర్గాలు తలెత్తుకునేలా చేసిన సీఎం జగన్‌ : డిప్యూటీ సీఎం నారాయణస్వామి: 

మైనార్టీలకు ఎంతో మేలుచేసిన సీఎం జగనన్న:  డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మబంధువు జగనన్న: ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సామాజిక సాధికారయాత్ర దిగ్విజయంగా సాగింది. వర్షం కురుస్తున్నా లెక్కచెయ్యకుండా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. జన ప్రభంజనంతో సభా స్థలి సంద్రాన్ని తలపించింది. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన సామాజిక సాధికారక యాత్రలో డిప్యూటీ సీఎంలు అజాంద్‌ బాషా, నారాయణస్వామి, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

నారాయణస్వామి, డిప్యూటీ సీఎం

– ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే కాదు, ప్రతిపేదవాడికీ మేలు చేయాలని తపిస్తున్నారు. ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. లబ్ధిదారులకు పథకాల ఫలితాలు నేరుగా అందేలా చూస్తున్నారు.  

– వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు  పెద్దపీట వేసింది.

– సామాజిక న్యాయమంటే నినాదం కాదు విధానమని చాటి చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 

– తన మొదటి కేబినెట్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14మందికి స్థానం కల్పించారు సీఎం జగన్‌. అంటే దాదాపు 56శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చారన్నమాట.తర్వాతి విస్తరణలో మరింతమందికి అవకాశం కల్పించారు.

– నలుగురు డిప్యూటీ సీఎంలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని నియమించారు. 

– సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 

 

అంజాద్‌ బాషా, డిప్యూటీ సీఎం

 

–భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలయింది. ఎంతో మంది ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఏ ఒక్కరూ సామాజిక సాధికారత దిశగా ఆలోచించింది లేదు. 

–ఈ రోజు సామాజిక సాధికారతే నా నినాదం అంటున్నారు జగనన్న. 

–తన కే బినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. డిప్యూటీ సీఎంలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని నియమించారు.  

– నేను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేనయినా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా.. అంతా ముఖ్యమంత్రి గొప్పదనమే.

– మొట్టమొదటిసారిగా మైనార్టీ మహిళను శాసనమండలి వైస్‌ఛైర్మన్‌గా నియమించారు. 

– మైనార్టీ పక్షపాతి అయిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే, అది మన ఏపీలోనే. 

–2024 జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం బడుగు బలహీన వర్గాల వారికి చారిత్రక అవసరం.  

–మళ్లీ చంద్రబాబుగారు తన అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వస్తారు. –గతంలో ఆయన బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  చేసిందీ ఏమీ లేదు. 

–మనకోసం నిలబడే, మనల్ని ముందుకు నడిపించాలని తపించే జగనన్న గెలిపించుకోవడం మన కర్తవ్యం. 

– వర్షం పడుతున్నా చెక్కుచెదరకుండా ఇక్కడే నిలబడ్డ అశేష జనావళిని చూస్తుంటే... అందరూ జగనన్నను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారని అర్థమవుతోంది.  

 

బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ

– సంక్షేమపథకాల వెల్లువతో బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. 

– విద్యావ్యవస్థలో, ఆరోగ్యరంగంలో జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. 

– మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95శాతం అమలు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పటికి 99శాతం హామీలు అమలు చేశారు. 

–దేశచరిత్రతో కనీవినీ ఎరుగని రీతిలో నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.40లక్షల కోట్లను డిబీటీ ద్వారా జమ చేశారు. ఇందులో 75శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి.  

 

   అనిల్‌కుమార్‌యాదవ్, మాజీమంత్రి.

 

– వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా తరలివచ్చిన జగనన్న అభిమానుల్ని చూస్తుంటే, 2024లో జగనన్న గెలిచితీరతారనడంలో సందేహమే లేదు.

– 40 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ.. మాది బీసీల పార్టీ అని చెబుతూ వచ్చిందేకానీ, బీసీలకు చేసిందేమీ లేదు. 

– 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. 

–దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు సీఎం జగన్‌. 

–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదవులు ఇచ్చి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సాధికారతకు బాటలు వేశారు.  

– స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చిన్నచూపే చూశాయి. సున్నా కింద లెక్కకట్టారు. ఆ సున్నా పక్కనే ఒకటి పెట్టి పది, వేలు, వందలు, కోట్లు చేసిన గొప్ప నాయకుడు జగనన్న. 

–ఎవరి అండదండలు లేకున్నా, పెద్దగా బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, యాదవకులానికి చెందిన 

నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిన, మంత్రిని చేసిన మంచి మనిషి జగనన్న. ఆయనను మించిన గొప్పనాయకుడు నాకు కనిపించలేదు ఇప్పటిదాకా. 

–జగన్‌మోహన్‌రెడ్డి మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. 

–గతంలో నాయీ బ్రహ్మణులను అవమానించిన చరిత్ర బాబుది. మత్స్యకారులను అవమానించిన చరిత్ర బాబుది. 

–ఆ సోదరులను కూడా రాజ్యసభకు పంపిన గొప్పనాయకుడు జగనన్న. 

–నాయీ బ్రాహ్మణ సోదరుల్ని, తిరుమల నుంచి అన్ని దేవాలయాల్లో సభ్యుల్ని చేసి సత్కరించిన పెద్దమనసు జగనన్నది. 

– మనం ముందుకు వెళ్లాలనుకుంటే జగనన్న వెంటే నడవాలి. 

–మన కోసం ఎంతదూరమైనా వెళ్లే, ఎంతపోరాటానికై సిద్దపడే, అనుక్షణం పేద, బడుగు, బలహీన వర్గాల వారి గురించి ఆలోచించే.. జగనన్న చేస్తున్న మంచి పనుల గురించి మనమందరం ఆలోచించాలి. 

–మరోసారి మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్న దొంగ కూటముల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఆ దొంగకూటముల బాబు, పవన్‌ల దొంగనాటకాలకు తెరవేయాలి. 

–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను బలంగా నమ్ముకున్న జగనన్నను గెలిపించుకుందాం. నాటకాల రాయుళ్లను పారిపోయేలా చేద్దాం. 

–మన బిడ్డల కోసం, పేద బిడ్డల కోసం ..వారి ఉజ్జ్వల భవిష్యత్తుకోసం ఎంతో ఆలోచించే దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.

Back to Top