తూర్పుగోదావరి: రైతుల ముసుగులో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు నాలుగేళ్ల పండుగ చేసుకుంటున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వైయస్ఆర్‌సీపీ సామాజిక సాధికార యాత్రలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రసంగించారు. - *ఈ దేశం మొత్తం మీద జగన్ గారిని భయపెట్టే వాడున్నాడా?* - *జగన్ గారిని భయపెట్టాలంటే ఎదుటి వ్యక్తీ జగనే అయ్యుండాలి* - *ఒక తరాన్ని బాగుచేయాలంటే అది జగన్ గారికే సాధ్యం* - *ఇది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల రాజ్యం..జగన్ గారిని ఓడిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా?* - *చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు..?* - *ఏ ముఖం పెట్టుకుని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఓటేయమంటున్నాడు?* - *దళిత బిడ్డ శిరీషకు వచ్చినన్ని ఓట్లు రాలేదు..వీళ్లు జగన్ గారిని ఓడిస్తారట?* - *ఈసారి స్పీడ్ పెంచి ఫ్యాన్‌ని 175 మీద తిప్పండి*: ఎంపీ నందిగం సురేష్ *బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రసగం:* అమరావతిని కులరాజధానిగా చేసి దళితులను వేదించారు: - అమరావతి అనే ఒక కులరాజధాని పెట్టి మన దళిత బిడ్డలను హింసించాడు. - నన్ను 48 గంటలు జైళ్లో కూర్చోబెట్టి అనేక రకాలుగా బాధలు పెట్టాడు. - చంద్రబాబు మనలాంటి వాళ్లను జైళ్లో కూర్చోబెడితే..నాలాంటి వారిని జగన్ గారు పార్లమెంటులో కూర్చోబెట్టారు. - ఎవరు గొప్ప అనేది ఆలోచించాలి. చంద్రబాబు మన జీవితాలను వెక్కిరిస్తే..జగన్ గారు మన జీవితాలను చక్కదిద్దే పనిలో ఉన్నారు. - చంద్రబాబు తన పరిపాలనలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఏం చేశాడో చెప్పాలి. - కేవలం 23 సీట్లు వచ్చిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. - మరి 151 సీట్లు పొందిన జగన్ గారు ఏమనుకోవాలి..? రైతుల ముసుగులో ఉన్న టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు నాలుగేళ్ల పండుగ చేసుకుంటున్నారు: - 2018లో పవన్ కల్యాణ్ చంద్రబాబు దొంగ అన్నాడు. చంద్రబాబు కులరాజధాని కడుతున్నాడు..సంపద కొడుక్కి దోచిపెడుతున్నాడు అన్నాడు. - ఇప్పుడు సిగ్గు శరం, చీమూ నెత్తురు లేకుండా చంద్రబాబు చంకనాకుతున్నాడు. - అమరావతి ఉద్యానికి నాలుగేళ్లు అంటూ రైతుల ముసుగులో ఉన్న టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు పండుగ చేసుకుంటున్నారు. - చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట వేసి నాలుగేళ్లు అవుతోంది. - చంద్రబాబు లక్షల కోట్ల స్కాంలు చేశాడు. దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపాడు. - ఈ మధ్యకాలంలో ఆయన చేసిన తప్పులకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా వెళ్లాడు. - అమరావతి ప్రాంతంలో ఒక కులానికి చెందిన కొంత మంది వ్యక్తులు కలిసి దాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు సంపాదించుకున్నారు. - ఆ పార్టీకి చెందిన నారాయణ, పుల్లారావు లాంటి వ్యక్తులు అక్కడ దోచుకుతిని భూములన్నిటిని దోచేశాడు. - అసైన్డ్ భూములకు సరైన ప్యాకేజీ ఇవ్వండి అంటే మీ భూములు లాక్కుంటాం..ఐదో పదికో అమ్ముకోండి అని చంద్రబాబు అన్నాడు. - జగన్ గారు వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి న్యాయం జరుగుతుందో అంతా చూస్తున్నారు. - అసైన్డ్ భూములున్న వారికి ఆ భూములు అప్పజెప్పేందుకు జగన్ గారు కృషి చేస్తున్నారు. - జగన్ గారు వచ్చిన తర్వాత రాక ముందు గమనిస్తే చంద్రబాబు దరిద్రం పట్టినట్లు పట్టాడని ప్రజలు భావించాడు. జగన్ గారిని ఓడించే దమ్ము వాళ్లకు ఉందా?: - గత నాలుగున్నరేళ్లలో జగన్ గారి సంక్షేమ పాలనను, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. - చంద్రబాబు 14 ఏళ్లు పాలించి 2 ఎకరాలుగా ఉన్న వ్యక్తి ఆరు లక్షల కోట్లు సంపాదించాడు. - ముఖ్యమంత్రి పదవి సంపాదించుకోవడానికి అని చంద్రబాబు భావిస్తే..జగన్ గారు తన పాలనతో ప్రజలు బాగుపడాలని ఆకాంక్షించారు. - విద్య, వైద్యంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. - ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు, ఆయన కూటమి కలిసి జగన్ గారిని ఓడించాలని చూస్తున్నారు. - గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా? జగన్ గారిని ఓడించే దమ్ము వాళ్లకు ఉందా? - ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి జగన్ గారు మళ్లీ నాకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. - చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు...? - ఏం చూసి పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఓటు వేయమని చెప్తున్నాడో ఆలోచించాలి. జగన్ గారితోనే మన జీవితాల్లో వెలుగులు: - జగన్నన్న వచ్చిన తర్వాతనే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాగున్నారు. - చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే మన జీవితాలను వెక్కిరిస్తారు. - చంద్రబాబు మన జీవితాల్లో వెలుగు ఆర్పేస్తే...జగన్ గారు వచ్చి వెలుగులు నింపారు. - మన బిడ్డలు ఇంగ్లీషు మీడియం చదవడానికి వీళ్లేదని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడు. - 31 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్లు కట్టిస్తుంటే కోర్టులకెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. - చంద్రబాబు ఈ రాష్ట్ర సంపద నీ బాబుగాడిదా? జగన్ గారు పేదలు బాగుండాలని గొప్ప పరిపాలన చేస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు. - చంద్రబాబు అనే వ్యక్తి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. జగన్ గారిని భయపెట్టాలంటే ఎదుటి వ్యక్తీ జగనే అయ్యుండాలి: - ఆయన కొడుకు హాఫ్ మైండ్ గాడు జగన్ గారిని భయపెడతాడట. - ఈ దేశం మొత్తం మీద జగన్ గారిని భయపెట్టే వాడున్నాడా? - లోకేశ్..మానాన్నను చూసి 40 రోజులైంది అని ఏడ్చావు చూడు..అదీ భయపెట్టడమంటే. - సోనియా గాంధీనే ఎదిరించి సొంత పార్టీ పెట్టిన నాయకుడు వైఎస్ జగన్ గారు. - జగన్ గారిని భయపెట్టాలంటే..ఎదుటి వ్యక్తి కూడా జగనే అయ్యి ఉండాలి. ఒక తరాన్ని బాగుచేయాలంటే అది జగన్ గారికే సాధ్యం: - చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కంపల్లో, వరదల్లో మునిగిపోయే చోట పెట్టాలని చూశాడు. - జగన్ గారు వచ్చి విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారు. - విజయవాడలో కొండపై అమ్మవారు..విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారు ఫేమస్. - ఒక దినం గడవాలంటే చంద్రబాబు..సాయంత్రానికి రూ.500 ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. - ఒక తరం, ఒక జీవితం బాగుపడాలంటే మాత్రం ఒక్క జగన్‌గారికే సాధ్యం. - అంబేద్కర్ విగ్రహం తన వేలును తాడేపల్లి వైపు చూపిస్తోంది. - తన ఆశయాలను నెరవేర్చే నాయకుడు తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తున్నాడు. - ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటాడా అని చంద్రబాబు అన్నాడా లేదా? బీసీల బట్టలు ఊడదీసి కొడతానన్నాడు. - కరోనా సమయంలో ఈ రాష్ట్రం ఏమైపోతుందా అని మనందరం బాధ పడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రం వైపే చూడలేదు. - ఈ రాష్ట్రాన్ని, మన ప్రాణాలను కాపాడిన వ్యక్తి జగన్ గారు. - ఈ సారి ఎన్ని కుయుక్తులు పన్ని వచ్చినా మా పిల్లలు బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారే ఉండాలని చెప్పండి. - మహిళలకు ఈ మధ్య కాలంలో పార్లమెంటులో రిజర్వేషన్లు పెట్టారు. - వారికంటే ముందే మన రాష్ట్రంలో జగన్ గారు ఆడబిడ్డలకు రిజర్వేషన్ అమలు చేసిన నాయకుడు. ఇది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల రాజ్యం..జగన్ గారిని ఓడిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా?: - జగన్ గారు ఇచ్చే పథకాలే మీరు ఇచ్చేటట్లయితే మీరెందుకు..? జగన్ గారు ఉన్నారుగా? - తెలంగాణలో ఉంటూ వీరంతా ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. - తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు హెలికాఫ్టర్, గన్‌మెన్లను ఇచ్చి ప్రచారం చేయమని పంపాడు. - ఈ మధ్య నరేంద్రమోడీ ఫోన్ చేసి నీకు హెలికాఫ్టర్ అనవసరంగా పెట్టాం కదా అని అన్నాడట. - తెలంగాణలో మన దళిత బిడ్డ శిరీష పోటీ చేస్తే ఆమెకు వచ్చినన్ని ఓట్లు పవన్ కల్యాణ్‌కు రాలేదు. వీళ్లందరూ కలిసి జగన్ గారిని ఓడిస్తారట... - మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు సింగిల్‌గా పోటీ చేస్తే మీ బతుకులు బయటపడుతాయి. - ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం...వీళ్లంతా కలిసి జగన్ గారిని ఓడిస్తాం అంటే చూస్తూ ఊరుకుంటామా? - మీరంతా కలిసి ఫ్యాన్ 151 స్పీడ్ మీద తిప్పారు...మనందరం కలిసి ఇప్పుడు 175 మీద తిప్పుదాం.