పేదవాడి ఆత్మగౌరవ పతాక జగనన్న

ఉద్యమాలు చేయకుండానే సంస్కరణలు తెచ్చాం: మంత్రి ధర్మాన ప్రసాదరావు

రాష్ట్రంలో ఏ తలుపు తట్టినా సంక్షేమం అందిందనే స్థితి: మంత్రి మేరుగ నాగార్జున

బడుగుల జీవితాల్లో మార్పులు తెచ్చిన జగనన్న: మంత్రి చెల్లుబోయిన వేణు

 రాష్ట్రంలో ప్రతి ఇంటికీ లక్షల రూపాయల సాయం: మంత్రి సీదిరి అప్పలరాజు

నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నదే: మంత్రి దాడిశెట్టి రాజా​

తుని నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర

కాకినాడ‌:  తుని నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కదం తొక్కారు. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం సాకారం చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలో భారీగా జనం తరలి వచ్చారు. జగనన్న అండతో తాము సాధించిన సాధికారతను నేతలు ప్రజలకు చెప్పారు. సామాజిక సాధికార యాత్రతో తుని రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జక్కంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. 

మంత్రి ధర్మాన ప్రసాదరావు
– రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన సాగిస్తోంది. 
– ఈ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల ఎన్నడో నిస్పృహలో పడిన వర్గాలు, జీవితంలో మార్పు రాదనుకున్న వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి.
– ఓటు వేయని వారికీ సంక్షేమం అందింది. నా వాడు అధికారంలో లేడు కాబట్టి తలవంచుకొని ఉండాలనే పరిస్థితి లేదు.
– ఎవరికీ నయాపైసా లంచం ఇవ్వకుండా సంక్షేమం అందే స్థితిని తీసుకురాగలిగాం. 
– ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతినకుండా సంక్షేమం అందించడంలో ఈ ప్రభుత్వం విజయవంతమైంది.
– గతంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీలు టిడిపి కార్యకర్తలను పెట్టి వారి గుప్పెట్లోనే పథకాలు పెట్టారు. కలెక్టర్‌ దగ్గరకెళ్లినా జన్మభూమి కమిటీలవద్దకే వెళ్లాలనే దుస్థితి ఉండేది.
– కానీ ఇప్పుడు ఎవరూ ఎవరి వద్దా తలవంచి దండం పెట్టాల్సిన అవసరం లేదు. 
– అభివృద్ధి, సంక్షేమం అందుకోవడంలో ఓ గౌరవం ఉంది. ఇది ఇతర రాష్ట్రాల్లో లేదు. 
– ఎవరూ ఉద్యమాలు చేయకుండానే సంస్కరణలు అమలు చేస్తున్నాం.
– ఎవరూ కోరకుండానే గతంలో విద్య ప్రయివేటుపరం, వ్యాపారంగా మారిపోయింది. దీనికి టీడీపీనే కారణం.
– నేడు జగన్‌ ప్రభుత్వం విద్యవ్యవస్థలో మార్పులు తెచ్చింది. స్కూళ్లన్నీ ఆధునికంగా మారాయి. ప్రపంచంలో పోటీని తట్టుకొనే సిలబస్‌ వచ్చింది. చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదనే స్థితి వచ్చింది. 
– ప్రయివేటు వ్యక్తుల వద్ద నుంచి రూ.12,800 కోట్లు పెట్టి భూమిని కొని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ఇలా పేదల కోసం చంద్రబాబు ఏనాడూ చెయ్యలేదు. 
– 100 సంవత్సరాల కిందట బ్రిటీష్‌ వారు చేసిన సర్వేమీదే భూమి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి రీసర్వే చేస్తున్నాం. 
– విద్యుత్‌ రేట్లు దేశంలో ఏ రాష్ట్రంలో మనకంటే చవకగా ఉన్నాయి? విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ధరలు దేశమంతా ఒకేలా ఉన్నాయి.
– ఇతర విషయాలు చంద్రబాబు విమర్శించలేకపోతున్నారు. అందుకే ఈ విషయాలే చెబుతున్నారు.
– అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
– మరో 20 ఏళ్లు ఈ ప్రభుత్వం కొనసాగితే సమాజంలో చాలా మార్పు వస్తుంది. 

మంత్రి మేరుగ నాగార్జున
 
– రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మిగిలిన కులాలతోపాటు ధైర్యంగా బతకాలని ఆలోచించిన సీఎం జగన్‌.
– చంద్రబాబు ప్రభుత్వంలో పేదలపై, ఎస్సీలపై దాడులు జరిగాయి. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న నీచ సంస్కృతి, బీసీలు జడ్జిలుగా పనికిరారన్న వ్యక్తి చంద్రబాబు.
– కానీ నేడు రాష్ట్రంలో పేదల స్థితిగతులు మారాయి. పేదలు గుండెమీద చేయి వేసుకొని ధైర్యంగా బతుకుతున్నారు.
– ఆశ్రిత పక్షపాతం లేకుండా సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కమ్మని పాలన అందుతోంది. 
– ఏ ఇంటి తలుపుతట్టినా జగనన్న మాకు మేలు చేశారనే పరిస్థితి కనిపిస్తోంది.
– 640 వాగ్దానాలిచ్చి ఒక్కటీ నెరవేర్చని టీడీపీ. మళ్లీ పవన్‌తో కలిసి మోసం చేయాలని వస్తున్న చంద్రబాబు.
– రాష్ట్రంలో పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలని కోట్లు ఖర్చుపెట్టిన జగనన్న.
– కార్పొరేట్‌ వైద్యం చేయించుకొని ఇంటికొచ్చిన తర్వాత కూడా డబ్బులిస్తున్న జగనన్న.
– 31 లక్షల ఇళ్ల పట్టాలిస్తే అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.
– రూ.2.40 లక్షల కోట్లు పేదవారికి ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం అందాయి.
– చంద్రబాబు ఐదేళ్లలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టలేకపోయాడు. నేడు విజయవాడ నడిబొడ్డున కోట్ల ఖరీదు చేసే అంబేద్కర్‌ విగ్రహం పెడుతున్న సీఎం జగన్‌.
– రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జగనన్నను కాపాడుకోవాలి. 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

– గత పాలకుడి వివక్షకు, మోసానికి, చిన్నచూపునకు, వంచనకు గురైన వర్గాలను నా వర్గాలు అన్న జగనన్న.
– ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పేదరికంతో బాధపడుతున్నారని, ఆ వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగనన్న.
– అధికారంలోకి వచ్చాక వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేలా పాలన చేస్తున్నారు. సామాజిక సాధికారత అంటే ఇదీ అని దేశానికి చూపిస్తున్నారు.
– అబద్ధం, మోసం, కుట్ర, కుతంత్రం అంటే చంద్రబాబు. 
– పేదోడికి జబ్బు చేస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టాల్సి వచ్చేది. పేదల ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆలోచించాడా?
– ఆరోగ్యశ్రీ ఇచ్చి ఈ వర్గాల ప్రాణాలకు బాసటగా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి మనవాళ్లు చదవడానికి కారణమయ్యారు.
– 2014లో మళ్లీ మోసపు హామీలతో గెలిచి ఆరోగ్యశ్రీని సగానికి తీసేసిన బాబు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ కి శ్లాబు విధించాడు. ఇలా బీసీలను మోసం చేశాడు.
– అబద్ధం ఇప్పుడు ఆరు తలలుగా ప్రజలను పట్టి పీడించడానికి వస్తోంది. ఈ కుట్రలను ప్రజలు గమనించాలి. 
– కులగణన ప్రారంభించిన ఘనత జగనన్నది.
– అమ్మ ఒడి అనే ఔషధం ద్వారా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించిన సంస్కర్త సీఎం జగన్‌.

మంత్రి సీదిరి అప్పలరాజు

– ఏ నియోజకవర్గానికి వెళ్లి సాధికార యాత్ర చేసినా అదొక సంబరంలా జరుగుతోంది. వేలాది మంది జనం వస్తున్నారు. 
– గతంలో చంద్రబాబు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అవమానించారు. 
– మత్స్యకారులను తోలుతీస్తానన్నాడు. నాయీబ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖరాసిన ఘనుడు.
– చంద్రబాబును విడిచిపెట్టం. పిడికిలి బిగిద్దాం. నడుం కడదాం. బాబు శాశ్వతంగా రాజకీయాల్లోంచి విరమించేదాకా విశ్రమించం.
– ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వ్యాఖ్యానించాడు చంద్రబాబు.
– ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్‌లో ఒక్కరికీ అవకాశం ఇవ్వని బాబు.
– నేడు జగనన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఈబీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలిచ్చారు.
– ఆ అవకాశాలే ఇప్పుడు ఈ వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీటీసీల రూపంలో బడుగు బలహీన వర్గాల సైన్యంగా మీముందుకు వచ్చింది. 
– చంద్రబాబు దగ్గర బానిసత్వం చేస్తున్న యనమల రామకృష్ణుడు. బీసీల్ని అవమానిస్తే అడగలేదు.
– అప్పుడూ అదే బడ్జెట్, ఇప్పుడూ అదే బడ్జెట్, ప్రతి ఇంటికీ లక్షల రూపాయలు జగనన్న సాయం చేశారు. చంద్రబాబు చేయగలిగాడా?
– నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత జగనన్నది.
– రూ.5 లక్షలతో సీసీ రోడ్డు వేసి అభివృద్ధి అని టీడీపీ అంటే.. కోటి రూపాయలతో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌లు కట్టిన ఘనత మనది.

మంత్రి దాడిశెట్టి రాజా

– బడుగు, బలహీన వర్గాలు జగనన్నను గుండెల్లో పెట్టుకుంటున్నాయి.
– ఈ రాష్ట్రంలో ఉన్న 70–80 శాతం బడుగు బలహీన వర్గాలకు జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరిగింది.
– చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా వెలగబెట్టి ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. ఆ పదవులు డబ్బులకు అమ్ముకున్నాడు.
– అదే జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. 
– రూ.1,735 కోట్లు తుని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి డీబీటీ ద్వారా అందజేశారు. 
– నాలుగు సంవత్సరాల్లో 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు. ఇందులో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే.

ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

– 70 శాతానికిపైగా మంత్రి పదవులు, 50 శాతం పైగా కార్పొరేషన్‌ చైర్మన్లు, మేయర్‌ పదవులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకిచ్చిన జగనన్న.
– జగనన్న పరిపాలనలో నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. 
– స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో తొలిసారి బీసీని మంత్రిగా చేసిన జగనన్న.
– మాకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు గొర్రెలు కాచుకొనేవాళ్లని మాట్లాడారు.
– నా తండ్రి, నా తాత ముత్తాతలు గొడ్లు, ఆవులు కాచుకున్నాం. గర్వపడుతున్నాం. 
– మనం మొక్కే శ్రీకృష్ణుడు, ఏసు ప్రభువు కూడా గొర్రెలు, ఆవులు కాచినవాళ్లే.
– జగనన్న సారథ్యంలో పని చేస్తున్నందుకు తలెత్తుకొని బతుకుతున్నాం. గర్వంగా ఫీలవుతాం. 
– వేంకటేశ్వర స్వామి ఆలయం గుడి తెరిచేది యాదవులే. అది ఒక వరం. 
– ఇలాంటి వరాన్ని 1996లో సన్నిధిగొల్లలకు వంశపారంపర్యం బాబు తీసేస్తే ఏం చేశారు? జగనన్న వచ్చాక మళ్లీ పునరుద్ధరించారు.
– మత్స్యకార సోదరులను చంద్రబాబు అవమాన పరిస్తే ఇదే తెగకు చెందిన వారిని రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నది.
– రాబోయే ఎన్నికలు బలిసిన వాళ్లకు, బక్కచిక్కిన వాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. బలిసినోడి పక్కన బాబు, పవన్‌ ఉన్నారు. బక్కచిక్కిన వారి పక్కన జగనన్న ఉన్నాడు.

Back to Top